ఆ సినిమాలో హీరో చిన్నప్పటి రోల్ కూడా అతనే చేసాడు…అన్నేళ్లు పట్టింది ఆ సినిమా.!

ఆ సినిమాలో హీరో చిన్నప్పటి రోల్ కూడా అతనే చేసాడు…అన్నేళ్లు పట్టింది ఆ సినిమా.!

by Megha Varna

Ads

సామాన్యంగా సినిమాలలో హీరో చిన్నప్పటి పాత్ర ఒకటి ఉంటుంది.ఆ తర్వాత ఆ పిల్లడు పెరిగి పెద్దోడు అయ్యి హీరో అవుతాడు.అయితే చిన్నప్పటి పాత్ర ఒక చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తాడు పెద్దయిన తర్వాత వేరే వ్యక్తి ఆ పాత్ర చేస్తాడు.అయితే ఒక సినిమాలో చిన్నప్పటి పాత్ర చేసిన వ్యక్తే పెద్దయిన తర్వాత వచ్చే పాత్ర కూడా చేసాడు.అసలు అది ఏ సినిమా ? ఎలా ఆ సినిమాను నిర్మించారు ? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

ఒక సినిమాను మాములుగా ఒక సంవత్సరం లేదా రెండు,మూడు సంవత్సరాలు నిర్మిస్తారు.అవతార్ లాంటి కొన్ని సినిమాలు అయితే ఓ 5 సంవత్సరాలు తీస్తారు.కాగా ఈరోజులలో కొన్ని నెలలలో కూడా సినిమాలు తీస్తున్నారు అనుకోండి.అయితే ” బాయ్ హుడ్ “అనే చిత్రాన్ని 12 సంవత్సరాలు షూటింగ్ చేసారు.ఎందుకు “బాయ్ హుడ్” చిత్రాన్ని అన్ని రోజులు నిర్మించాల్సి వచ్చింది అంటే ఈ చిత్రంలో చిన్నప్పటి పాత్ర చేసిన వ్యక్తే తర్వాత పెద్దయిన తర్వాత వచ్చే పాత్ర కూడా చేసాడు.

అయితే ఆ చిన్నప్పటి బాబు పెద్దోడు అయ్యేదాకా ఎదురుచూడడంతో “బాయ్ హుడ్” చిత్రం తెరకెక్కడానికి 12 సంవత్సరాలు పట్టింది .బాయ్ హుడ్ దర్శకుడు రిచర్డ్ లింక్లటెర్ స్క్రిప్ట్ ఒరిజినాలిటీ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఓ సందర్భంలో తెలిపారు. “బాయ్ హుడ్” చిత్రం 6 క్యాటగిరీలలో ఆస్కార్ కు నామినేట్ అయింది. కాగా ఒక కేటగిరీ లో ఆస్కార్ ను సొంతం చేసుకుంది “బాయ్ హుడ్” చిత్రం.


End of Article

You may also like