Ads
ఏదైనా పనిని ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితె కొంతమంది ఇది మా ఆచారం ఎప్పటినుండో వస్తున్నా సంప్రదాయం అని అంటారు.ఎందుకంటే సంప్రదాయాన్ని ఒక రూల్ ల పాటిస్తారు అందరూ.ఏదైనా సంప్రదాయాన్ని మూలలలోకి వెళ్లి పరిశీలిస్తే ఆ ఆచారం పెట్టడానికి గల కారణం అర్ధం అవుతుంది.కాలానికి అనుగుణంగా ఈ ఆచారవ్యవహారాలు అనేవి మారుతూ వస్తుంటాయి.అయితే ఆషాడం లో పెళ్లి అయిన కొత్త దంపతులు ఒకచోట కలిసి ఉండకూడదు అనే నియమం ఒకటి ఉంది.దానిని నేటికీ చాలామంది పాటిస్తారు.ఆషాడం మాసంలో దంపతులు ఎందుకు కలిసి ఉండకూడదు దానికిగల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
పూర్వం రోజులలో ఇప్పటిలాగా రకరకాల ఉద్యోగాలు ,వృత్తులు లేవు ఎవరైనా సరే వ్యసాయం మీదే ఆధారపడి జీవించాల్సిందే.అయితే ఆషాడ మాసంలో విపరీతమైన వాతావరణ మార్పులు సంభవిస్తాయి.ఎక్కువగా చలి ఉండడం ,అకారణంగా వర్షాలు పడడం లాంటివి జరిగి నదులు ,కలువులలో వైరస్ ,బాక్టీరియా లాంటివి ఎక్కువ వృద్ధి చెందుతాయి.దీంతో పెళ్లి అయిన కొత్త దంపతులు కలిసి ఉంటె గర్భం దాల్చితే ఆషాడ మాసంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఈ నియమం పెట్టినట్టు తెలుస్తుంది.
ఆ సమయంలో కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి పుట్టింట్లో ఉండడమే శ్రేయస్కరమని అప్పట్లో పెద్దలు భావించారు.పైగా ఆషాడ మాసంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలలు పూర్తి అయ్యేటప్పటికి చైత్ర మాసం వస్తుంది.చైత్ర మాసంలో కాన్పు అవ్వాలంటే ఆ మాసంలో ఉన్న అధిక వేడి దృష్ట్యా గర్భిణీ స్త్రీకి అలాగే పుట్టబోయే బిడ్డకు మంచిది కాదు అని ఈ నియమం పెట్టినట్లు తెలుస్తుంది.
ఆషాడ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసం అన్నివిదాలాగాను మంచిది.శ్రావణ మాసంలోనే రకరకాల యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు.అందుకే శ్రావణ మాసంలో కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి గర్భం దాల్చితే తల్లికి అలాగే పుట్టబోయే బిడ్డగా మంచిది అని తిరిగి మళ్ళీ శ్రావణ మాసంలో అమ్మాయిని అత్తవారింటికి తీసుకువస్తారు.
End of Article