గుడిలో “రజినీకాంత్” ని చూసి బిచ్చగాడు అనుకొని 10 రూపాయలు దానం చేసింది ఆ మహిళ..చివరికి ఏమైందంటే?

గుడిలో “రజినీకాంత్” ని చూసి బిచ్చగాడు అనుకొని 10 రూపాయలు దానం చేసింది ఆ మహిళ..చివరికి ఏమైందంటే?

by Mohana Priya

Ads

ఒక మనిషిని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అలా మనిషిని చూసి అంచనా వేస్తే చిన్న చిన్న పొరపాట్లు కూడా అవుతుంటాయి. ఇందులో పొరపాటు అంటే ఏదో తప్పు అని కాదు మిస్ అండర్స్టాండింగ్ అన్నమాట. ఈ కథ చదివితే అసలు విషయం ఏంటి అనేది మీకే అర్థమవుతుంది.

Video Advertisement

Also Read: 30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే…ఎదురుకోవాల్సిన 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఒక రోజు గుడి ముందు కూర్చుని ఉన్నాడు. సాధారణమైన బట్టలతో, పెరిగిపోయిన జుట్టు, గడ్డం తో ఉన్నాడు ఆ వ్యక్తి. ఒక ఆవిడ గుడి దగ్గరికి వచ్చింది. లోపలికి వెళుతూ గుడి దగ్గర కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూసింది. అతనిని ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్న ఆమె ఇతనికి కూడా ₹10 ఇచ్చి గుడి లోకి వెళ్ళింది.

Also Read: భర్త మరణించాక ప్యాలెస్ నుండి పంపించేశారు…పండ్ల దుకాణం పెట్టుకున్న ఆమెకి భర్త రాసిన డైరీ.?

ఆమె దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఒక ఖరీదైన కారు ఎక్కడం చూసింది. అతను ఎవరో తెలుసుకోకుండా అలా డబ్బులు ఇచ్చాను అని కారు దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి ని ఆపి క్షమాపణ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ” పర్వాలేదమ్మా. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. మీ ద్వారా భగవంతుడు నాకు నా హోదాను చూసుకుని వచ్చిన అహాన్ని తొలగించి నేను కూడా ఒక బిచ్చగాడిని అనే సత్యం తెలియజేశాడు” అని ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీంట్లో మనకు తెలిసింది ఏమిటి అంటే ఒక వ్యక్తిని చూసి మనం అతని పరిస్థితి ఎలా ఉంది అనే విషయం పై అంచనాకు రాలేము. తమ దగ్గర ఉన్న దానికంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకునే మనుషుల మధ్య ఎంత డబ్బు ఉన్నా కానీ సాధారణంగా ఉండే మనుషులు కూడా ఉంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు కదా. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్.

రజనీకాంత్ ఎంత సాధారణంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్ గా తీసుకునే రజనీకాంత్ ఈ విషయాన్ని కూడా తేలికగా తీసుకొని ఆ సంఘటన ద్వారా దేవుడు తనకి ఒక విషయాన్ని బోధించారు ఆ మహిళతో చెప్పి వెళ్ళిపోయారు.

Also Read: “ఇంట్లో ఇలాంటి బట్టలు వేసుకోకు…మీ మామ గారు ఉన్నారు”…పెళ్లి తర్వాత నా జీవితం ఎలా మారిపోయిందంటే.?


End of Article

You may also like