భర్త మరణించాక ప్యాలెస్ నుండి పంపించేశారు…పండ్ల దుకాణం పెట్టుకున్న ఆమెకి భర్త రాసిన డైరీ.?

భర్త మరణించాక ప్యాలెస్ నుండి పంపించేశారు…పండ్ల దుకాణం పెట్టుకున్న ఆమెకి భర్త రాసిన డైరీ.?

by Harika

Ads

మనం ఇతరులతో మంచిగా ఉంటే మన జీవితం కూడా చాలా మంచిగా ఉంటుంది. అయితే దానికి నిదర్శనం ఈ కథ. ఆమె పేరు లుమెయ్. మూడేళ్ళ క్రితం ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లయింది. పెళ్లయిన తరువాత నుంచి ఆమె భర్తకు చెందిన ప్యాలస్ లో నివాసం ఉండేది. వారికి సంతానం కూడా కలిగింది. అయితే.. దురదృష్టవశాత్తు ఆమె భర్త హార్ట్ ఎటాక్ రావడంతో మరణించారు. దీనితో.. ఆమె దిగ్బ్రాంతి చెందింది.

Video Advertisement

భర్తను ఎంతగానో ప్రేమించిన లుమెయ్ భర్త చనిపోవడంతో బోరున విలపించింది. చాలా రోజులపాటు తాను మాములు మనిషి కాలేకపోయింది. ఆమె భర్తతో పాటు కలిసి నివసించిన ప్యాలస్ లో చాలా గదులు ఉండేవి. వాటిలో కొన్నిటిని.. ఆ ప్యాలస్ కి దగ్గరలో ఉన్న స్కూల్ కి చెందిన విద్యార్థులకు ఇచ్చేవారు.

ఆ స్కూల్ చదువుకునే స్టూడెంట్స్ ఆ ప్యాలస్ లోనే ఉంటూ చదువుకునేవారు. అయితే.. ఓ రోజు విద్యార్థులకు ఇవ్వడానికి రూమ్స్ లేకపోవడంతో.. లుమెయ్ భర్త సోదరుడు.. లుమెయ్ ఉంటున్న రూమ్ ని ఖాళీ చేయించాడు. లుమెయ్ తో ఆమె చిన్నారిని కూడా బయటకు గెంటేసాడు. భర్త తరపు వారు కూడా ఏమి మాట్లాడలేదు. దీనితో లుమెయ్ ఆ ప్యాలస్ నుంచి బయటకు వచ్చేసింది.

తన చిన్నారితో కలిసి పండ్ల దుకాణాన్ని మొదలుపెట్టింది. కొంతకాలం గడిచాక ఆమె వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు ఆమెకు ఉద్యోగం ఇస్తామని.. తమ కంపెనీకి రావాలని కోరారు. దీనితో మొదట ఆమె ఆశ్చర్యపోయింది. తరువాత ఇంటికి వెళ్ళినపుడు ఇంట్లో ఉన్న తన భర్త డైరీని తీసి చదివింది. అందులో తన భర్త బతికి ఉన్న సమయంలో చేసిన మంచి పనుల గురించి రాసి ఉంది. ఆమె భర్తనుంచి సాయం పొందిన వారిలో ఆ ఇద్దరు కూడా ఉన్నారు.

lumey 1

వారు డబ్బు ఇస్తామని అడిగితె.. తన భర్త తిరస్కరించాడు. తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని.. కొన్ని రోజుల్లో చనిపోతానని.. తన మరణం తరువాత తన భార్యాపిల్లలని చూడాలని వారిని కోరినట్లు ఆ డైరీలో రాసి ఉంటుంది. ఆరోజు రాత్రి ఆమెకు కలలో భర్త కనిపించి వారు మంచి వారేనని.. వారి కంపెనీ లో ఉద్యోగం చేయమని చెబుతాడు.

lumey 2

దీనితో ఆమె అనుమానాలను వదిలేసి.. వారు ఇచ్చిన అడ్రస్ కు చేరుకుంది. అక్కడ వారు ఆమెను ఘనంగా స్వాగతించారు. వారు ఉద్యోగం ఇస్తామని.. లేదంటే ఏదైనా వ్యాపారం చేసుకుంటానంటే డబ్బు ఇస్తామని అంటారు. కానీ ఆమె డబ్బు వద్దని.. అదే కంపెనీ లో ఉద్యోగం చేసుకుంటానని కోరుతుంది. తక్కువ సమయంలోనే ఆమె మంచి ఇంటికి మారుతుంది. మనం మంచి పనులు చేసుకుంటూ వెళితే.. ఆ మంచి మనకి తరువాత కచ్చితంగా చేరుతుంది అని చెప్పడానికి ఈ దంపతుల కథే ఉదాహరణ.


End of Article

You may also like