నన్ను చూడటానికి ఓ పెద్దాయన 5 km నడుచుకుంటూ వచ్చారు నా కళ్ళ వెంట కనీళ్లు ఆగలేదు

నన్ను చూడటానికి ఓ పెద్దాయన 5 km నడుచుకుంటూ వచ్చారు నా కళ్ళ వెంట కనీళ్లు ఆగలేదు

by Mohana Priya

Ads

టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో దుర్గా రావు ఒకరు. దుర్గా రావు ఇంకా ఆయన భార్య గంగా రత్నం కలిసి టిక్ టాక్ లో వీడియోలు చేసే వారు. దుర్గా రావు డాన్స్ వేస్తూ ఉంటే, గంగా రత్నం పక్కనే నుంచుని పాట పాడుతూ లిప్ సింక్ ఇస్తూ ఉంటారు. దాదాపు అన్ని వీడియోస్ ఇదే ఫార్మాట్ లో ఉంటాయి.

Video Advertisement

కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో వీరిద్దరూ టిక్ టాక్ లో పాపులర్ అయ్యారు. యూట్యూబ్ లో కూడా వీరిద్దరి వీడియోస్ కి చాలా క్రేజ్ ఉంటుంది. ఇటీవల క్యాష్ ప్రోగ్రాం లో దుర్గా రావు, గంగా రత్నం వచ్చారు. అలాగే జబర్దస్త్, అదిరింది ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనల్ని అలరించారు.

ఇటీవల దుర్గా రావు, గంగా రత్నం ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో దుర్గా రావు మాట్లాడుతూ అదిరింది షో తర్వాత పక్క ఊర్లో ఉన్న ఒక పెద్దాయన 5 కిలోమీటర్లు నడుచుకుంటూ దుర్గారావు దగ్గరికి వచ్చి చుట్టు పక్కల ఇప్పటి వరకు ఎవరూ టీవీలో కనిపించలేదు అని, నువ్వు కనిపించావు అని అభినందించారు.

దానికి దుర్గా రావు తనని ఇంత పాపులర్ చేసిన అభిమానులకు ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది అన్నారట.  అలాగే ఇంకొక అభిమాని కూడా కాలికి దెబ్బ ఉన్నాకూడా పట్టించుకోకుండా దుర్గా రావు ని చూడడం కోసం వాళ్ళ ఇంటికి వచ్చారట. ఆ అభిమాని దుర్గా రావు తో కలిసి ఒక డాన్స్ చేయాలి అని అడిగారట. తర్వాత అతనికి ఫోన్ చేసి ఎలా ఉన్నారని వివరాలు కనుక్కున్నారట దుర్గా రావు.

watch video:


End of Article

You may also like