ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ 8 టీంల Highest & Lowest Totals ఎంతో తెలుసా.?

ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ 8 టీంల Highest & Lowest Totals ఎంతో తెలుసా.?

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే హవా. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అసలు ఇది ఐపీఎల్ మొదలయ్యే టైం కాకపోయినా కూడా, ఈ సారి ఉన్న పరిస్థితుల కారణంగా లేట్ గా అయినా సరే ఐపీఎల్ మొదలైంది. అంతే కాకుండా ఈ సారి ఐపీఎల్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, వాటన్నిటినీ దాటుకొని ఐపీఎల్ టెలికాస్ట్ చేసే ఛానల్స్  కి టాప్ టిఆర్పీ ఇస్తూ దూసుకుపోతోంది.

Video Advertisement

ఐపీఎల్ లో చాలా రికార్డులు క్రియేట్ చేశారు. కానీ ప్రతి సారి ఆట ఒకటే లాగా ఉండాలి అని రూలేమీ లేదు. కొన్ని సార్లు హైయెస్ట్ స్కోర్ సాధించిన టీమ్స్ ఒకొక్క సారి తక్కువ స్కోర్ చేయచ్చు. మళ్ళీ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారు. ఆలా కొన్ని జట్ల హైయెస్ట్ ఇంకా లోయెస్ట్ టోటల్స్ ఏవో ఇపుడు చూద్దాం.

#1 కోల్కతా నైట్ రైడర్స్

హైయెస్ట్ స్కోర్ :

2018 లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోర్ చేసింది.

లోయెస్ట్ స్కోర్ :

2008 లో ముంబై ఇండియన్స్ జట్టు కి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 67 పరుగుల స్కోర్ చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో నాలుగవ లోయెస్ట్ స్కోర్.

#2 చెన్నై సూపర్ కింగ్స్

హైయెస్ట్ స్కోర్ :

2010 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగుల స్కోర్ చేసింది.

లోయెస్ట్ స్కోర్ :

2013 లో ముంబై ఇండియన్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో, ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 139 పరుగుల స్కోర్ చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 79 పరుగుల స్కోర్ చేసింది.

#3 రాజస్థాన్ రాయల్స్

హైయెస్ట్ స్కోర్ :

2010 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 246 పరుగుల స్కోర్ చేయగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు 223 స్కోర్ చేసింది.

లోయెస్ట్ స్కోర్ :

2010 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి కేప్ టౌన్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 15.1 ఓవర్లలో 58 పరుగుల స్కోర్ చేసింది.

#4 ఢిల్లీ క్యాపిటల్స్

హైయెస్ట్ స్కోర్ :

2011 లో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అయిన అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో ఆడినప్పుడు 4 వికెట్ల నష్టానికి 231 పరుగుల స్కోర్ చేసింది. ఇందులో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 29 పరుగుల తేడాతో ఓడిపోయింది.

లోయెస్ట్ స్కోర్ :

2017 లో ముంబై ఇండియన్స్ జట్టు కి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13.4 ఓవర్లలో 66 పరుగుల స్కోర్ చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మూడవ లోయెస్ట్ స్కోర్.

#5 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

హైయెస్ట్ స్కోర్ :

2013 లో పూణే వారియర్స్ జట్టు కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు జరిగిన మ్యాచ్ లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల స్కోర్ చేసింది.  రన్స్ మార్జిన్ పరంగా  ఇది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యొక్క ఐదవ అతిపెద్ద విజయం.

లోయెస్ట్ స్కోర్ :

2017 లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 9.3 ఓవర్లలో 49 పరుగుల స్కోర్ చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో లీస్ట్ స్కోర్ గా నిలిచింది.

#6 కింగ్స్ ఎలెవన్ పంజాబ్

హైయెస్ట్ స్కోర్ :

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 2011 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తో ఆడిన మ్యాచ్ లో 232 పరుగుల స్కోర్ చేసింది. ఇది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి ఐపీఎల్ లో ఏడవ అతిపెద్ద విజయం.

లోయెస్ట్ స్కోర్ :

2017 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జుట్టుకి, రైజింగ్ పూణే సూపర్ జయింట్ జుట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో, మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 15.5 ఓవర్లలో ఆల్ అవుట్ అవ్వడానికి ముందు కేవలం 73 పరుగుల స్కోర్ చేసింది.

#7 ముంబై ఇండియన్స్

హైయెస్ట్ స్కోర్ :

2017 ఐపీఎల్ ఎడిషన్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కి, ముంబై ఇండియన్స్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 230/3 స్కోర్ చేయగా, ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల స్కోర్ చేసింది.

లోయెస్ట్ స్కోర్ :

2018 ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 87 పరుగుల స్కోర్ చేసింది.

#8 సన్ రైజర్స్ హైదరాబాద్

హైయెస్ట్ స్కోర్ :

గత సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 231 పరుగుల స్కోర్ చేసింది.

లోయెస్ట్ స్కోర్ :

గత సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 17.4 ఓవర్లలో 96 పరుగుల స్కోర్ చేసింది.


End of Article

You may also like