Home Sports Adda క్రిస్ గేల్ ఫ్రస్ట్రేషన్.. కోపంతో బ్యాట్ విసిరికొట్టాడు…వీడియో వైరల్‌

క్రిస్ గేల్ ఫ్రస్ట్రేషన్.. కోపంతో బ్యాట్ విసిరికొట్టాడు…వీడియో వైరల్‌

by Anudeep

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ భారీ స్కోరు సాధించింది. హార్డ్‌హిట్టర్‌ క్రిస్‌గేల్‌(99: 63 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో   పంజాబ్‌ 20 ఓవర్లలో 4  వికెట్లకు 185 పరుగులు చేసింది.చివరి ఓవర్‌లో ఆర్చర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతిని భారీ సిక్సర్ కొట్టిన గేల్.. 99 పరుగుల వద్ద ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్ట్ అయ్యాడు. దాంతో ఫ్రస్ట్రేషన్‌లో బ్యాట్‌ని విసిరికొట్టాడు గేల్. బ్యాట్ చాలా దూరం ఎగిరిపోయి పడిపోయింది. అయితే ఆ వెంటనే బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను మెచ్చుకొని క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

You may also like