చిప్స్ ప్యాకెట్ లో సగం “గాలే” ఎందుకు ఉంటుందో తెలుసా.? మార్కెటింగ్ ట్రిక్ కాదు…అసలు కారణం ఏంటంటే.?

చిప్స్ ప్యాకెట్ లో సగం “గాలే” ఎందుకు ఉంటుందో తెలుసా.? మార్కెటింగ్ ట్రిక్ కాదు…అసలు కారణం ఏంటంటే.?

by Mohana Priya

Ads

మనం ఎప్పుడైనా చిప్స్ కొనుక్కుంటాం. ప్యాకెట్ చూడడానికి ఏమో చాలా పెద్దగా ఉంటుంది. లోపల చాలా చిప్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. కొనుక్కున్న తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేస్తే లోపల చిప్స్ కంటే ఎక్కువగా గాలి ఉంటుంది.

Video Advertisement

అది చూస్తే మనం కొన్నది చిప్స్ కాదు గాలిని ఏమో అనిపిస్తుంది. అన్ని రూపాయలు పెట్టి కొనుక్కుంటే వచ్చే చిప్స్ ఇన్నేనా అనిపిస్తుంది. కానీ అలా చిప్స్ ప్యాకెట్ లో గాలి నింపడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే.

అసలు చిప్స్ ప్యాకెట్ లో నింపే గాలి ఏంటో తెలుసా? చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. మామూలు గాలిలో ఆక్సిజన్, వాటర్ వేపర్ వంటి పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల చిప్స్ తొందరగా పాడైపోతాయి. కాబట్టి ఆ రెండిటిని రానివ్వకుండా ఉండడానికి చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు.

ఈ ప్రాసెస్ ని మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్ (MAP) అని అంటారు. ఇది ఆహార పదార్థాల క్వాలిటీ కరెక్ట్ గా మెయింటెన్ చేయడానికి సహాయపడుతుంది. ఇలా చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ గ్యాస్ నింపడం వల్ల బ్యాక్టీరియా ఎంటర్ అవ్వదు. అది ఎలాగంటే, బ్యాక్టీరియా రావడానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకపోతే బ్యాక్టీరియా పెరగదు. ఇందులో ఆక్సిజన్ ఉండదు కాబట్టి చిప్స్ మీద బ్యాక్టీరియా ఉండదు.

అలాగే తేమ వల్ల కూడా చిప్స్ తొందరగా పాడైపోతాయి. నైట్రోజన్ ఉండడం వల్ల వాటర్ వేపర్ ఉండదు. వాటర్ వేపర్ లేకపోతే తేమ ఉండదు. లోపల గాలి ఉండడం వల్ల చిప్స్ ప్యాకెట్ ఒక పిల్లో లాగా ఉంటుంది. చిప్స్ కి మధ్య కాంటాక్ట్ తక్కువగా ఉంటుంది. దాంతో చిప్స్ పాడవకుండా (విరగకుండా, పొడి లాగా అవ్వకుండా) ఉంటాయి.

అయితే మనలో చాలా మందికి అసలు ఒక్క చిప్స్ ప్యాకెట్ లో ఎంత గాలి ఉంటుందో, తెలుసుకోవడం ఎలా? అనే ఒక అనుమానం వస్తుంది. స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ప్రకారం చిప్స్ మాన్యుఫాక్చరింగ్ చేసే వాళ్ళు నెట్ వెయిట్ కచ్చితంగా మెన్షన్ చేయాలి అని ఒక రూల్ ఉంది. కానీ ఈ రూల్ ని ఎక్కడో కొద్ది మంది మాన్యుఫ్యాక్చరర్స్ మాత్రమే పాటిస్తున్నారు.


End of Article

You may also like