Ads
సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే వాళ్ళింట్లో ఒక ఏడాది వరకు పూజలు చేయరు. కొంతమందైతే దీపం కూడా వెలిగించరు. సంవత్సరీకం అయిపోయిన తర్వాత దేవుడి పటాలను శుభ్రపరిచి పూజలు చేస్తారు. కానీ ఈ పద్ధతి సరైనది కాదు. శాస్త్రంలో ఎక్కడా ఈ విధంగా చెప్పలేదు. దీపం శుభాన్ని సూచిస్తుంది.
Video Advertisement
దీపం ఎక్కడ వెలుగుతూ ఉంటే అక్కడికి దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోనూ ఎప్పుడూ దీపారాధన జరగడం అనేది ఎంతో ముఖ్యం. మరణించిన ఇంట్లో పదకొండవ రోజు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఆ పదకొండు రోజులు మాత్రమే పూజలు చేయకూడదు.
శాస్త్రంలో ఇంతవరకు మాత్రమే చెప్పారు. కానీ ఏడాది పాటు పూజలు చేయకూడదు అని, దీపం వెలిగించకూడదు అని చెప్పలేదు. అసలు శాస్త్రం ప్రకారం సూతకంలో ఉన్నప్పుడు కూడా సంధ్యావందనం చెయ్యాలి అని, అర్ఘ్య ప్రధానం వరకు బాహ్యంగా చేసి, మిగిలినది మానసికంగా చేయవచ్చు అని చెప్పారు.
అంతే కాకుండా సంవత్సరం పాటు గుళ్ళకి వెళ్ళకూడదు అని కూడా చెప్పలేదు. మనం రోజూ చేసేది కొనసాగించవచ్చు. కానీ కొత్త పూజలు ప్రారంభించకూడదు. ఒకవేళ అంతకు ముందు గుడికి వెళ్లే అలవాటు ఉంటే, సూతకం తర్వాత కూడా గుడికి వెళ్ళవచ్చట.
మనం రోజు పూజ చేసే పటాల్లో దేవతలు కూర్చుంటారు. ఒక సంవత్సరం పాటు పూజలు చేయకుండా, దీపారాధన జరగకుండా, దేవుడి పటాలని బట్టలో చుట్టి పక్కన పెట్టడం లాంటివి చేయడం ఇంటికి మంచిది కాదు. అంతే కాకుండా ఇంటికి, ఇంటి సభ్యులకు ఏవైనా దోషాలు ఉన్నా కూడా వాటిని ఆపే శక్తి ఇంట్లో జరిగే దైవారాధనకి ఉంటుంది. అందుకే ఇంట్లో రోజు పూజ, దీపారాధన కచ్చితంగా జరగాలి.
End of Article