Ads
హైవేస్ మీద ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్ వస్తుంది. అక్కడ ఛార్జెస్ కడతాం. డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. కొంత మంది తర్వాత దాన్ని పారేస్తారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే ఆ రిసిప్ట్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే.
Video Advertisement
# ఆ హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకవేళ దారిలో ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే, ఆ రిసిప్ట్ వెనకాల ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే 10 నిమిషాల లోపు మీరు ఉన్న చోటికి ఆంబులెన్స్ వస్తుంది.
# ఒకవేళ దారిలో వాహనం టైర్ పంచర్ అవ్వడం, లేదా బండికి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం లాంటివి జరిగినప్పుడు రిసిప్ట్ వెనకాల ఉన్న నంబర్ కి కాల్ చేస్తే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సహాయం అందిస్తారు.
# ఒక్కొక్కసారి మన వాహనాల్లో పెట్రోల్ అయిపోవచ్చు. దగ్గరలో పెట్రోల్ బంక్ లేకపోవచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. వాతావరణం బాలేనప్పుడు లేదా చీకటి పడుతున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే కష్టం. అలాంటప్పుడు వాళ్లు ఐదు నుంచి పది లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ తెచ్చిస్తారు. అప్పుడు మనం తీసుకున్న పెట్రోల్ లేదా డీజిల్ కి తగిన డబ్బులు చెల్లించాలి.
ఇవన్నీ టోల్ గేట్ దగ్గర కట్టే ఛార్జెస్ లో వర్తిస్తాయి. ఈ విషయాలు ఎక్కువ మందికి తెలియవు. అందుకే చాలా మంది టోల్ గేట్ దగ్గర ఇచ్చిన రిసిప్ట్ ని తేలికగా తీసుకుంటారు. కానీ పైన చెప్పిన అత్యవసర సమయాల్లో మనం టోల్ గేట్ దగ్గర ఛార్జెస్ కట్టి రిసిప్ట్ తీసుకోవడం, ఆ రిసిప్ట్ ని భద్రపరచుకోవడం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.
End of Article