Ads
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా ఉపయోగిస్తారు. మన క్రికెటర్లు కూడా ఆడుతున్నప్పుడు వారి ముఖంపై ఒక లోషన్ రాసుకుంటారు. అది ఎక్కువగా ముక్కు, బుగ్గలపై లేదా పెదాలపై అప్లై చేసుకొని కనిపిస్తారు. అది సన్ స్క్రీన్ లోషన్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ మామూలుగా వాడే సన్ స్క్రీన్ లోషన్ కి, ప్లేయర్స్ వాడే సన్ స్క్రీన్ లోషన్ కి తేడా ఉంది. అది ఏంటంటే.
Video Advertisement
ప్లేయర్స్ వాడే సన్ స్క్రీన్ జింక్ ఆక్సైడ్ తో తయారుచేస్తారు. ఇది రాసుకోవడం వల్ల అల్ట్రా వైలెట్ రేస్ (అతినీలలోహిత కిరణాలు) అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. అల్ట్రా వైలెట్ రేస్ లో మూడు రకాలు ఉంటాయి. యువిఏ (UVA), యువిబి (UVB), ఇంకా యువిసి (UVC). యువిఏ రేస్ చర్మంలోని లోపలి లేయర్ వరకు వెళ్తాయి. దీనివల్ల ప్రీమెచ్యూర్ ఏజింగ్ (ముడతలు రావడం, ఏజ్ స్పాట్స్, స్కిన్ క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఉంటాయి.
యువిబి రేస్ వల్ల చర్మంపై మంట రావడం, చర్మం ట్యాన్ అవ్వడం అవుతాయి. అలాగే చర్మం అవుటర్ లేయర్ పై కూడా ఈ రేస్ యొక్క ప్రభావం పడుతుంది. యువిసి రేస్ ని భూమి ఎట్మాస్ఫియర్ ఫిల్టర్ చేస్తుంది. జింక్ ఆక్సైడ్ తో తయారుచేసిన సన్ స్క్రీన్ లోషన్ కి ఈ యువిఏ, యువిబి కిరణాలు చర్మంపై పడకుండా తిరిగి రిఫ్లెక్ట్ అయ్యే గుణం ఉంటుంది.
మనం మామూలుగా వాడేది టైటానియం డయాక్సైడ్ తో తయారుచేసిన సన్ స్క్రీన్ లోషన్. ఇది యువిఏ, యువిబి కిరణాలని చర్మంలోకి అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం ఎండలో ఎక్కువసేపు ఉండము కాబట్టి ఈ సన్ స్క్రీన్ లోషన్ వాడుతాము. కానీ ప్లేయర్స్ ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ సన్ స్క్రీన్ లోషన్ అంతసేపు ఎండ ప్రభావాన్ని తట్టుకోలేదు. అందుకే జింక్ ఆక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ని వాడతారు.
End of Article