రోజుకి 121 రూపాయలు చెల్లిస్తే…మీ కూతురు పెళ్లి నాటికి 27 లక్షలు ఇస్తారు.! LIC కన్యాదాన్ పాలసీ పూర్తి వివరాలు.!

రోజుకి 121 రూపాయలు చెల్లిస్తే…మీ కూతురు పెళ్లి నాటికి 27 లక్షలు ఇస్తారు.! LIC కన్యాదాన్ పాలసీ పూర్తి వివరాలు.!

by Mohana Priya

Ads

తల్లిదండ్రులకు ఉండే ఆలోచనల్లో తమ పిల్లలను పెంచి పెద్ద చేసి తర్వాత వారికి మంచి భవిష్యత్తు అందించడం అనే ఆలోచన ముందు ఉంటుంది. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, తమ కూతురికి మంచి జీవితం ఏర్పరచాలి ప్రతి తల్లిదండ్రి కలగంటూ ఉంటారు. అలాగే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆడపిల్లల కోసం ఎల్ఐసి ఒక కొత్త పాలసీ ప్రారంభించింది. దీని పేరు ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ.

Video Advertisement

ఇందులో రోజుకి 121 రూపాయలు చెల్లిస్తే, పెళ్లి నాటికి 27 లక్షల రూపాయలు అందజేస్తారు. ఇది ఒక నాన్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, నామినీకి ప్రతి సంవత్సరం బీమా డబ్బులలో 10 శాతం మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి, పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత జీవించి ఉంటే, బోనస్ తో కలిపి మొత్తాన్ని అందజేస్తారు. ఈ ప్లాన్ ని కనీసం లక్ష రూపాయలతో తీసుకోవాలి. మాక్సిమం లిమిట్ 13 లక్షల వరకు ఉంటుంది.

13 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు పాలసీదారులు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఇలా ఇన్స్టాల్మెంట్ గా మొత్తాన్ని చెల్లించవచ్చు. పాలసీదారులు తీసుకున్న టర్మ్ కంటే మూడు సంవత్సరాలు తక్కువగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. కూతురికి ఒక సంవత్సరం వయసు అయినా ఉండాలి.

ఒకవేళ పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు అయినా కూడా 22 సంవత్సరాల ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ఈ పాలసీ 25 సంవత్సరాలకి లేదా 13 సంవత్సరాలకి కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీలో 10 లక్షలు, లేదా రూ. 12.25 లక్షలు బోనస్ గా వస్తాయి. అడిషనల్ బోనస్ గా ఎల్ఐసి 4.5 లక్షల రూపాయలను ఇస్తుంది. అంటే పాలసీదారులు రూ. 26.75 లక్షలు పొందుతారు అన్నమాట.

ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారులు చనిపోతే, ప్రీమియం మొత్తాన్ని కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాలసీదారులు ప్రమాదవశాత్తు చనిపోతే, నామినీకి 10 లక్షల బీమా వస్తుంది. సహజ మరణం అయితే 5 లక్షల రూపాయల బీమా వస్తుంది.

 


End of Article

You may also like