Ads
ఒక మనిషి తన రోజు మొత్తంలో ఒక్కసారి అయినా సరే కీబోర్డ్ టైపింగ్ వాడతాడు. అది ఫోన్ లో కీ – ప్యాడ్ అయినా కావచ్చు లేకపోతే లాప్ టాప్, కంప్యూటర్ లో కీబోర్డ్ అయినా కూడా కావచ్చు. కానీ కీబోర్డ్ వాడడం మాత్రం ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది. మనలో చాలా మందికి ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే. కీబోర్డ్ లో అక్షరాలు లైన్ గా కాకుండా రాండమ్ గా ఉంటాయి.
Video Advertisement
కీబోర్డ్ లో అక్షరాలు ABCD అనే లైన్ లో ఎందుకు ఉండవు? అని. అలా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే. పూర్వ కాలంలో టైపింగ్ మషిన్స్ ఉండేవి. వాటిలో అక్షరాలు లైన్ లోనే ఉండేవి. కానీ అలా లైన్ గా ఉండడం వల్ల టైపింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ గా టైప్ చేయడం వల్ల బటన్స్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అంతే కాకుండా ఫాస్ట్ గా టైప్ చేయడం వల్ల చేతులకి కూడా నెప్పి కలిగే అవకశాలు ఉన్నాయి. అందుకే చాలా రీసెర్చ్ తర్వాత మనం ఇప్పుడు వాడుతున్న కీబోర్డ్ పద్ధతిని కనిపెట్టారు. ఇప్పుడు మనం వాడుతున్న కీబోర్డ్ ని QWERTY కీబోర్డ్ అని అంటారు. ఇవి కీబోర్డ్ మీద మొదటి లైన్ లో ఉండే మొదటి అక్షరాలు. ఈ పాటర్న్ ని 1868 లో క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి కనిపెట్టారు.
కీబోర్డ్ ఇలా ఉండడంవల్ల టైపింగ్ స్పీడ్ నార్మల్ గా ఉంటుంది అని అంటారు. కానీ కీబోర్డ్ మీద అక్షరాలు దూరంగా ఉండడంవల్ల ఆల్టర్నేటివ్ గా అన్ని వేళ్ళను ఉపయోగిస్తాం. దానివల్ల స్పీడ్ గా కూడా టైప్ చేయగలుగుతాం అని ఇలా ఎరేంజ్ చేశారు అని కూడా అంటారు.
End of Article