Ads
ప్రతి బ్రాండ్ కి ఒక డిఫరెంట్ పేరు ఉంటుంది. డిఫరెంట్ పేరుతో పాటు డిఫరెంట్ లోగో కూడా ఉంటుంది. మనం ఒకవేళ ఆ బ్రాండ్ కు సంబంధించిన వస్తువు ఏదైనా చూస్తే, బ్రాండ్ పేరు లేకపోయినా కేవలం లోగో చూసి అది ఏ కంపెనీకి సంబంధించినది అనేది అర్థం చేసుకుంటాం. లోగోది ఏముంది? ఏదో ఒక చిన్న గుర్తు మాత్రమే కదా? అని మనలో చాలా మందికి అనిపిస్తుంది.
Video Advertisement
ఒక కంపెనీకి సంబంధించిన వస్తువులను ఎవరైనా డూప్లికేట్ చేసి అదే లోగో పెట్టి మార్కెట్ లో విడుదల చేయడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు సడన్ గా చూసి ఏది ఒరిజినల్? ఏది డూప్లికేట్? అనే విషయం లో కన్ఫ్యూస్ కూడా అవుతాం. అలాంటప్పుడు లోగోని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అందులో ఏదో ఒక చిన్న పొరపాటు ఉండే ఉంటుంది.
దాన్నిబట్టి ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనే విషయం తెలిసిపోతుంది. ఒక కంపెనీ ప్రాడక్ట్స్ మీద వారి లోగో అంత ముఖ్యం అన్నమాట. లోగో ఒక చిన్న సింబల్ అయినా కూడా అందులో చాలా అర్థం దాగి ఉంటుంది. చాలా పరిశీలిస్తే కానీ ఆ లోగో కి అర్థం మనకు అర్థం కాదు. హ్యుండాయ్ కంపెనీ మనందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాల నుండి హ్యుండాయ్ కంపెనీ ఉంది.
హ్యుండాయ్ అంటే కొరియన్ లో మోడర్నిటీ (ఆధునికత) అని అర్థం. ఈ కంపెనీ లోగో కూడా మనందరికీ తెలుసు. ఈపాటికే కర్సివ్ గా రాసిన H అక్షరం మనలో చాలా మందికి స్ట్రైక్ అయ్యే ఉంటుంది. కానీ హ్యుండాయ్ లోగో లో ఉండేది H అక్షరం కాదు. హ్యుండాయ్ లోగోలో ఇద్దరు మనుషులు హ్యాండ్ షేక్ చేస్తూ ఉంటారు. అంటే హ్యుండాయ్ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కి ప్రాముఖ్యతనిస్తుంది అని అర్థం.
అలాగే లోగో సిల్వర్ కలర్ లో ఉంటుంది. సిల్వర్ కలర్ బ్రాండ్ యొక్క సోఫిస్టికేషన్ (అధునాతన) ని రిప్రజెంట్ చేస్తుంది. చూశారా? ఒక చిన్న లోగోలో ఎంత అర్థం ఉందో. ఒకసారి హ్యుండాయ్ లోగో ను మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీకు కూడా ఇద్దరు మనుషులు హ్యాండ్ షేక్ చేస్తున్నట్లు కనిపిస్తారు.
End of Article