సాధారణ రైలు పట్టాలపై ఉన్నట్టు…”మెట్రో ట్రాక్” పై కంకర రాళ్లు ఎందుకు ఉండవో తెలుసా.?

సాధారణ రైలు పట్టాలపై ఉన్నట్టు…”మెట్రో ట్రాక్” పై కంకర రాళ్లు ఎందుకు ఉండవో తెలుసా.?

by Mohana Priya

Ads

జనాలు ఎక్కువ బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలా మనం మనం ట్రైన్ ఎక్కినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ట్రైన్ ని ఎక్కువ గమనించము. మన బెర్త్ తప్ప మిగిలినవి మనం పట్టించుకోము.

Video Advertisement

అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? అదేంటంటే. సాధారణంగా రైల్వే ట్రాక్ మీద రాళ్ళు ఉంటాయి. కానీ మళ్ళీ మెట్రో రైల్వే ట్రాక్ మీద రాళ్ళు ఉండవు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే ట్రాక్ మీద అలా రాళ్ళు ఉండడాన్ని ట్రాక్ బ్యాలస్ట్ అంటారు. రైల్వే ట్రాక్ కింద  పర్పెండిక్యులర్ గా ఒక బ్లాక్ లాంటిది పెడతారు.

why metro stations does not have track ballast

Also read: రైల్వే ట్రాక్స్ కింద‌, చుట్టూ కంక‌ర రాళ్ల‌ను ఎందుకు పోస్తారో తెలుసా..? వెనకున్న కారణం ఇదే.!

వాటిని రైల్వే స్లీపర్స్ అంటారు. రైల్వే ట్రాక్స్ మధ్య గ్యాప్ కరెక్ట్ గా ఉండేలా, అలాగే ట్రాక్ ఎప్పుడు నిటారుగా ఉండేలా ఉండడానికి ఈ రైల్వే స్లీపర్స్ సహాయపడతాయి. రైల్వే స్లీపర్స్ ని రైల్ రోడ్ టై లేదా క్రాస్ టై అని అంటారు. అంతకుముందు రైల్వే స్లీపర్స్ ని చెక్కతో తయారు చేసే వాళ్ళు. ఇప్పుడు కాంక్రీట్ తో కూడా చేస్తున్నారు.

why metro stations does not have track ballast

ఈ రైల్వే స్లీపర్స్, లోడ్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి అంటే రైల్వే స్లీపర్స్ ఉన్నంత ఎత్తువరకు ట్రాక్ మొత్తం సమానంగా ఉండడానికి ట్రాక్ బ్యాలస్ట్ ఉపయోగిస్తారు. ఈ ట్రాక్ బ్యాలస్ట్ కేవలం షార్ప్ గా ఉన్న రాళ్లతో మాత్రమే తయారు చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ట్రాక్ బ్యాలస్ట్ లో ఉపయోగించిన మెటీరియల్ స్మూత్ గా ఉంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది.

why metro stations does not have track ballast

దాంతో రైల్వే ట్రాక్ కి సపోర్ట్ ఉండదు. అందుకే ట్రాక్ బ్యాలస్ట్ లో షార్ప్ గా ఉన్న రాళ్ళని మాత్రమే వాడతారు. అంతే కాకుండా ట్రాక్ బ్యాలస్ట్ ఉండడం వల్ల రైల్వే ట్రాక్ మీద ఎటువంటి మొక్కలు పెరగవు. ఒకవేళ మొక్కలు పెరిగితే ట్రైన్ వెళ్తున్న చోట ఉండే  నేల బలహీనమవుతుంది.why metro stations does not have track ballast

ఇంక మెట్రో స్టేషన్లలో ట్రాక్ బ్యాలస్ట్ ఉండకపోవడం అనే విషయానికి వస్తే, మెట్రో స్టేషన్లలో ట్రాక్ నిర్మించిన విధానం కొంచెం  వేరేగా ఉంటుంది. వీల్ లోడ్ తట్టుకునే విధంగా ట్రాక్స్ రూపొందించారు. అంతే కాకుండా మెట్రో స్టేషన్లలో ట్రాక్స్ కి, జనాలకి మధ్య అంత ఎక్కువ దూరం ఉండదు కాబట్టి ఒకవేళ బ్యాలస్ట్ ఉంటే రాళ్లు ఎగిరి జనాలకి తగిలే ప్రమాదం ఉంది.

why metro stations does not have track ballast

ఇంకొక కారణం ఏంటంటే,  మెట్రో స్టేషన్లు క్లోజ్డ్ ఏరియాలో ఉండడం వల్ల స్టేషన్ల లోపల నడిచే ట్రైన్లు లిమిటెడ్ స్పీడ్ తో నడుస్తాయి. అందువల్ల ఇంపాక్ట్ లోడ్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే మెట్రో స్టేషన్లలో రైల్వే ట్రాక్  మీద ట్రాక్ బ్యాలస్ట్ ఉండదు.


End of Article

You may also like