Ads
అన్నిటికంటే వేగంగా ప్రయాణించే వాటిలో ఒకటి మనిషి మెదడు, ఇంకా ఆ మెదడులో వచ్చే ఆలోచనలు. ఒక మనిషి ఒకటే చోట కూర్చొని ప్రపంచం మొత్తం గురించి ఆలోచించగలరు. అందులో కొన్ని మామూలు ఆలోచనలు ఉంటే ఇంకొన్ని మాత్రం సందేహాలు ఉంటాయి. అలా చాలా మందికి వచ్చే సందేహాల్లో ఒకటి ఏంటంటే “మనిషి బతికి ఉన్నప్పుడు నీటిలో మునుగుతాడు. కానీ చనిపోయిన తరువాత తేలుతాడు. ఎందుకు?”.
Video Advertisement
ఈ ప్రశ్నకి కొంత మందికి సమాధానం తెలిసి ఉండొచ్చు. కొంత మందికి సమాధానం తెలిసి ఉండకపోవచ్చు. అసలు మనిషి బతికున్నప్పుడు నీటిలో మునగడానికి, చనిపోయిన తర్వాత నీటిలో తేలడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మనిషి బతికి ఉన్నప్పుడు వాళ్ల శరీరంలో ఉండే డెన్సిటీ, వాళ్లు ఊపిరితిత్తులలోకి తీసుకునే గాలిపై, వాళ్ల శరీరంలో ఉండే ఫ్యాట్ పై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ డెన్సిటీ ఎక్కువగా ఉంటే నీటిలోకి మునుగుతారు.స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు ఈ విషయాల గురించి, టెక్నిక్స్ గురించి కూడా చెప్తారు. మనిషి చనిపోయినప్పుడు ఊపిరితిత్తులలోని గాలి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత డెన్సిటీ అనేది నీటి కంటే ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా ముందు మునిగిపోతారు. తర్వాత శరీరంలో ఉండే సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) శరీరాన్ని తినడం మొదలు పెడతాయి. దాంతో శరీరంలో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారణంగా శరీరం యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది. గ్యాస్ అంటే తేలికగా ఉంటుంది. తేలికగా ఉన్నవి నీటి మీద తేలుతాయి. అందుకే డెన్సిటీ తగ్గి గ్యాస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనిషి శరీరం కూడా నీటిలో తేలుతుంది.
End of Article