Ads
ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల చాలా మంది ప్రజలు పెట్రోల్ ధరలు పెరగడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా బయో ఫ్యూయల్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది ఎలక్ట్రిక్ వాహనాల ను ఉపయోగించడం మొదలుపెట్టారు. దీని వల్ల ఖర్చులు తగ్గుతాయి. అయితే సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈ సమస్యకి పరిష్కారం కనుగొన్నారు.
Video Advertisement
సతీష్ కుమార్ హైదరాబాద్ కి చెందిన ఒక మెకానికల్ ఇంజనీర్. ఆయన ప్లాస్టిక్ ని ఉపయోగించి ఇంధనం తయారు చేయాలి అనే ఐడియా ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, అండ్ మీడియం ఎంటర్పైజెస్ ద్వారా సతీష్ కుమార్ ఒక కంపెనీ కూడా రిజిస్టర్ చేయించారు. సతీష్ కుమార్ చెప్పిన ప్రాసెస్ 3 స్టేజెస్ లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ పేరు ప్లాస్టిక్ పైరోలసిస్. ఈ స్టేజెస్ డిపాలిమరైజేషన్, గ్యాసిఫికేషన్, కండెన్సేషన్.
ఇందులో వాక్యూమ్ లో హై టెంపరేచర్ ఉపయోగించి వ్యర్థ పదార్థాలని డికంపోజ్ చేస్తారు . ఇందులో నీళ్లు అవసరం ఉండదు. ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఎటువంటి వ్యర్థ పదార్థాలు మిగిలిపోవు. 2016 నుండి తాను 50 టన్నుల రీసైకిల్ చెయ్యలేని ప్లాస్టిక్ ని ఇంధనంలోకి మార్చినట్టు సతీష్ తెలిపారు. అంతే కాకుండా ప్లాస్టిక్ రీసైకిల్ ప్రాసెస్ చేయడానికి 18 గంటలు తరువాత ఆయిల్ రావడానికి ఒక పది గంటల సమయం పడుతుంది అని,
గ్యాసిఫికేషన్ ప్రాసెస్ తర్వాత సపరేట్ కంటైనర్స్ లో ఇంధనం వస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం సతీష్ కంపెనీ రోజుకి 200 కేజీల ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి 200 లీటర్ల పెట్రోల్ ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ ఐడియా చాలా బాగుంది కదా? ఒకవేళ ఇది అమలు అయితే దేశ ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఎదుర్కొనే ఇబ్బందులను నుండి కొంచెం ఊరట లభిస్తుంది.
End of Article