Ads
ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా మనం ఎంచుకునే ఆప్షన్ ట్రైన్. ఒకవేళ ట్రైన్ లో కుదరదు అనుకుంటేనే వేరే ఆప్షన్స్ చూసుకుంటాం. ట్రైన్ లో ప్రయాణం చేయడం ఎంత సౌకర్యవంతమైనా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
మనలో చాలా మంది విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు వాటిని బ్యాక్ ప్యాక్ లాంటి బాగ్ లోనో.. లేదా హ్యాండ్ బాగ్ లోనో పెట్టుకుని ఆ బాగ్స్ ను ప్రయాణం అయ్యేవరకు తమతోనే ఉంచుకుంటూ ఉంటారు. అయితే, రాత్రి పూట ప్రయాణాలు చేసేవాళ్ళు వాటిని తమ తల కింద పెట్టుకోవడమో లేక పక్కన పెట్టుకోవడమో చేస్తూ ఉంటారు. అయితే బెర్త్ లో ఉండే ప్లేస్ తక్కువ ఉంటుంది. పక్కన పెట్టినా.. తల కింద పెట్టినా మనకి పడుకోవడానికి కంఫర్ట్ ఉండదు.
అలా కాకుండా.. ఆ బాగ్ కి మీరు కప్పుకుని బెడ్ షీట్ కొనని కట్టివేస్తే.. మీరు ప్రశాంతం గా పడుకోవచ్చు. ఎవరు బాగ్ కి బెడ్ షీట్ కప్పి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా మీ బాగ్ ని లాక్కోవాలని ప్రయత్నించినా.. బెడ్ షీట్ అంతా కదిలి వస్తుంది కాబట్టి మీకు స్పృహ వచ్చేస్తుంది. మీ బాగ్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
అలాగే, ఆ బాగ్ పైన మీరు కప్పుకునే బెడ్ షీట్ నే కప్పడం వలన దొంగల దృష్టి పడకుండా ఉంటుంది. ఇలా బాగ్ కి బెడ్ షీట్ ను కట్టడం వలన మనకు కూడా మన బాగ్ సేఫ్ గా ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. సాధారణం గా నిద్ర లో ఉన్నపుడే దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
End of Article