Ads
ప్రస్తుతం వచ్చేది వేసవి కాలం. వేసవి కాలంలో ఆరోగ్యపరంగా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మర్ లో దాదాపు ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం అనేదాన్ని వీలైనంతవరకు అవాయిడ్ చేస్తారు. ఒకవేళ వెళ్లినా కూడా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం, గొడుగు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు.
Video Advertisement
అంతే కాకుండా ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వేసవి కాలంలో మనమందరం ఎక్కువగా చేసే పని నీళ్లు తాగడం. మామూలుగానే ఎక్కువగా నీళ్ళు తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది అని అంటారు. ఇంక ఈ వేసవి కాలంలో మాత్రం ఎక్కువగా దాహం వేస్తుంది కాబట్టి ఎక్కువగానే నీళ్లు తాగుతూ ఉంటాం.
నీళ్లు మాత్రమే కాకుండా ఈ కాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలా కూల్ డ్రింక్స్ లాంటి పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే వీలైనంత వరకు సహజంగా తయారు చేసిన జ్యూస్ మాత్రమే తీసుకోవాలి.
అలాగే పండ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ మనం తరచుగా చేస్తూనే ఉంటాం. కానీ సమ్మర్ లో మాత్రం కొన్ని ప్రత్యేకమైన పండ్లు, జ్యూస్ లు తీసుకోవడం వలన దాహం తగ్గుతుంది. వేసవి కాలంలో దాహాన్ని తగ్గించే ఆహార పదార్థాలు ఏవి ఇప్పుడు చూద్దాం.
#1 నిమ్మకాయ నీళ్లు
#2 పుచ్చ కాయ
#3 కొబ్బరి నీళ్లు
#4 మజ్జిగ
#5 మామిడి కాయ
#6 చెరుకు రసం
వేసవి కాలంలో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల దాహం తగ్గడం, మాత్రమే కాకుండా డీహైడ్రేషన్ ను కూడా దూరం పెడుతుంది.
End of Article