Ads
కరోనా సెకండ్ వేవ్ లో ఎక్కువ మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవడంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దాంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాదాపు అందరూ వాడుతున్న పరికరం పల్స్ ఆక్సీమీటర్. దీనితో ఆక్సిజన్ లెవెల్ క్యాలిక్యులేట్ చేస్తారు. మన వేలి గోరు భాగాన్ని ఈ పల్స్ ఆక్సీమీటర్ మధ్యలో ఉన్న గ్యాప్ లో పెట్టగానే మన శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ ఆ మీటర్ మీద చూపిస్తుంది.
Video Advertisement
రక్తంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గి అనారోగ్య సమస్యలకు గురయ్యే వారి ఆక్సిజన్ స్థాయిని పరీక్షించడానికి ఈ పల్స్ ఆక్సీమీటర్ ఉపయోగిస్తుంటారు. ఆస్తమా, న్యూమోనియా, రక్తహీనత, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెజబ్బుల చికిత్సలో పల్స్ ఆక్సీమీటర్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మనం పీల్చే గాలి ఊపిరితిత్తులలోకి వెళ్లి ఫిల్టర్ అవుతుంది. ఆ తర్వాత ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరమంతటా ఆక్సిజన్ సరఫరా అవుతుంది.
హిమోగ్లోబిన్ లో ఉండే ఆక్సిజన్ స్థాయిని పల్స్ ఆక్సీమీటర్ లెక్కిస్తుంది. పల్స్ ఆక్సీమీటర్ వేలికి పెట్టుకోగానే, అందులో ఉన్న ఇన్ఫ్రారెడ్ కిరణాలు రక్తకేశనాళికలు లోకి వెళ్తాయి. అప్పుడు ఇన్ఫ్రారెెడ్ కిరణాలలో నుండి వచ్చి కాంతిని రక్త నాళాలు గ్రహించడం ఆధారంగా ఆక్సిజన్ స్థాయి కొలుస్తారు. ఆరోగ్యంగాా ఉన్నవారిలో ఆక్సిజన్ స్థాయి 95 నుంచి 99 శాతం వరకు ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి స్థిరంగా ఉన్నా కూడా పర్వాలేదు.
కానీ 92 శాతం కంటే తక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. పల్స్ ఆక్సీమీటర్ కేవలం ఆక్సిజన్ స్థాయి మాత్రమే కాకుండా హార్ట్ బీట్ రేట్ కూడా చూపిస్తుంది. దీనిని చూపుడు వేలికి కానీ, మధ్య వేలికి కానీ పెట్టుకోవాలి. పెట్టుకునే ముందు చేతి గోళ్ళకి నెయిల్ పాలిష్ ఉంటే తొలగించాలి. అలాగే చేతులు చల్లగా ఉంటే, వెచ్చగా అవ్వడానికి రెండు నిమిషాలపాటు చేతులను రుద్దుకోవాలి.
పల్స్ ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకునే ముందు ఒక ఐదు నిమిషాల పాటు ఎటువంటి ఆలోచనలు లేకుండా కూర్చోవాలి. ఆక్సిజన్ లెవెల్ ప్రతిరోజూ ఒకే సమయంలో మూడు సార్లు రికార్డ్ చేయాలి. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించినా లేదా ఆక్సిజన్ లెవెల్ 92 కంటే తక్కువగా అనిపించినా కూడా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఇలా పల్స్ ఆక్సీమీటర్ సహాయంతో తరచుగా ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఎలా పనిచేస్తుందంటే :
పల్స్ ఆక్సీమీటర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు ఆక్సిజన్ శాచ్యురేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందాక పైన చెప్పినట్టుగా ఆక్సిజన్, హిమోగ్లోబిన్ ద్వారా సరఫరా అవుతుంది. ఆక్సిజన్ సరఫరా చేసే హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ని “ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్” అని అంటారు. ఆక్సిజన్ సరఫరా చెయ్యని మాలిక్యూల్ ని “డి ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్” అని అంటారు. ఆక్సిజన్ సరఫరా చేసే హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ యొక్క శాతాన్ని ఆక్సిజన్ శాచ్యురేషన్ చూపిస్తుంది.
ఇప్పుడు పల్స్ ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆక్సిజన్ శాచ్యురేషన్ ని కొలవడానికి పల్స్ ఆక్సీమీటర్ లైట్ ని ఉపయోగిస్తుంది. లైట్ అనేది లైట్ సోర్స్ నుండి వచ్చి లైట్ డిటెక్టర్ మీదకు వెళ్తుంది. పైన కనిపించే ఫోటోలో, ఆక్సీమీటర్ పైన భాగంలో ఉన్న దాన్ని లైట్ సోర్స్ అంటారు. కింద భాగంలో ఉన్న దాన్ని లైట్ డిటెక్టర్ అంటారు.
ఒక వేలిని లైట్ సోర్స్ కి, లైట్ డిటెక్టర్ కి మధ్య పెడితే, లైట్ సోర్స్ నుండి వచ్చే లైట్, ఆ వేలి నుండి లైట్ డిటెక్టర్ కి చేరుతుంది. లైట్ సోర్స్ నుండి వచ్చే లైట్ లో కొంత భాగాన్ని వేలు గ్రహిస్తుంది (అబ్జార్బ్ చేసుకుంటుంది). లైట్ సోర్స్ నుండి వచ్చే లైట్ లో వేలు గ్రహించని మిగతా భాగం లైట్ డిటెక్టర్ మీద పడుతుంది.
ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ , డి ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, లైట్ సోర్స్ నుండి వచ్చే లైట్ ని వేరు వేరు వేవ్ లెంత్ లో గ్రహిస్తాయి. పల్స్ ఆక్సీ మీటర్ రెండు రకాల లైట్లను విడుదల చేస్తుంది. ఒకటి రెడ్ లైట్. దీని వేవ్ లెంత్ దాదాపు 650 నానోమీటర్లు ఉంటుంది. ఇంకొకటి ఇన్ఫ్రారెడ్ లైట్. దీని వేవ్ లెంత్ 950 నానోమీటర్లు ఉంటుంది.
బ్లడ్ గ్రహించే రెడ్ లైట్, అలాగే ఇన్ఫ్రారెడ్ లైట్ ని పోల్చి, పల్స్ అక్సీ మీటర్ ఆక్సిజన్ శాచ్యురేషన్ ని లెక్కిస్తుంది. శరీరంలో ఉన్న ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, డి ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ని బట్టి, రెడ్ లైట్ గ్రహించిన మొత్తాన్ని, ఇన్ఫ్రా రెడ్ లైట్ గ్రహించిన మొత్తాన్ని రేషియో రూపంలో పోల్చి చూస్తారు. ఈ రేషియో ఆధారంగా పల్స్ ఆక్సీమీటర్ ఆక్సిజన్ శాచ్యురేషన్ ని లెక్కిస్తుంది.
అయితే ఇందులో చిన్న క్యాలిక్యులేషన్ కూడా జరుగుతుంది. పల్స్ ఆక్సీమీటర్ నుండి వచ్చే కాంతి, వేలు యొక్క సైజ్ కి తగ్గట్టుగా వేలిలో ఉన్న టిష్యూ గ్రహించే అంత లైట్ సరఫరా చేస్తుంది. పల్స్ ఆక్సీమీటర్ మెమరీలో ఒక రిఫరెన్స్ కర్వ్ సేవ్ అయ్యి ఉంటుంది. ఈ రిఫరెన్స్ కర్వ్ ఆధారంగా పల్స్ ఆక్సీమీటర్ రీడింగ్ ని లెక్కిస్తుంది. ఇలా కాలిక్యులేట్ చేయడం ద్వారా పల్స్ ఆక్సీమీటర్ నుండి వచ్చే రీడింగ్ యొక్క ఖచ్చితత్వం (ఆక్యురసీ) పెరుగుతుంది. కాబట్టి పల్స్ ఆక్సీ మీటర్ నుండి వచ్చే రీడింగ్ అంత స్పష్టంగా ఉంటుంది.
watch video:
End of Article