Ads
చట్టానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనకు తెలియవు. అందులో చిన్న చిన్న విషయాలను కూడా వివరంగా చెప్తారు. మనం సాధారణంగా ఇలాంటివి ఉండవు అని అనుకుంటాం కానీ చట్టపరంగా అలాంటివి కరెక్ట్ అవుతాయి. అందుకు ఉదాహరణ ఓనర్ కి, అద్దెకి ఉండేవాళ్ళకి సంబంధించిన ఈ విషయం. ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఎక్కువ కాలం అద్దెకి ఉంటే ఆ ఇల్లు ఆ అద్దెకి ఉన్న వాళ్ళది ఇది అవుతుంది అని అంటారు.
Video Advertisement
కానీ చట్ట ప్రకారంగా చూస్తే ఈ విషయం కొంత వరకు నిజమే అయినా కానీ కొంత వరకు నిజం కాదు.అంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అద్దెకి ఉంటే ఆ వ్యక్తి తన జీవితాంతం ఆ ఇంట్లో అద్దెకి ఉండవచ్చు. కానీ ప్రతి నెల క్రమం తప్పకుండా అద్దె కట్టాలి. ఒకవేళ అలా ప్రతి నెల క్రమం తప్పకుండా అద్దె కడుతూ ఉంటే, అలాగే ఓనర్ ప్రమేయం లేకుండా ఇంటిని రెనొవేట్ లాంటివి చేయించకుండా ఉంటే ఆ వ్యక్తి జీవితాంతం ఆ ఇంట్లోనే అద్దెకి ఉండవచ్చు. దీనిని అడ్వర్స్ పొసెషన్ అని అంటారు.
అలాగే ఒక వేళ ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉంటూ ఉంటే ఆ ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ అతని పేరు మీద ఉంటే, కానీ ఆ వ్యక్తి దగ్గర రిజిస్టర్ సేల్ డీడ్ లేకపోతే ఓనర్ షిప్ హక్కులు ఎవరికి వస్తాయి? అనే ఒక అనుమానం కూడా చాలా మందికి ఉంటుంది. అయితే, ఒకవేళ ఒక వ్యక్తి ప్రాపర్టీ టాక్స్ కడుతూ ఉంటే, ఆ ప్రాపర్టీ టాక్స్ రసీదు ఆ వ్యక్తి పేరు మీద ఉంటే, ఓనర్ షిప్ హక్కులు అతనివే అవుతాయి.
దీనికి సేల్ డీడ్ తో సంబంధం లేదు. కానీ ప్రాపర్టీ టాక్స్ ఆ వ్యక్తి పేరు మీద రావాలి అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో అద్దెకు ఉండే వ్యక్తి ఓనర్ షిప్ నిరూపించుకోవడానికి టైటిల్ డీడ్ ఇవ్వాలి. ప్రాపర్టీ టాక్స్ ఒక వ్యక్తి పేరు మీద ఉంది అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ వ్యక్తి తన ఇంటికి సంబంధించిన పత్రాలను సబ్మిట్ చేసినట్టే.
అలాంటప్పుడు సేల్ డీడ్, ప్రాపర్టీ టాక్స్ కట్టే వ్యక్తి పేరు మీదే వస్తుంది. అలాగే కరెంట్, వాటర్ టాక్స్ కూడా ఆ వ్యక్తి పేరు మీదే వస్తాయి. ఒకవేళ ఇద్దరు వ్యక్తులకి ఇలాగే ఉంటే, అంటే ఇద్దరు వ్యక్తుల పేరు మీద ఇల్లు, ఎలక్ట్రిసిటీ ఉంటే ఇద్దరిలో ఓనర్ ఎవరు? అనే గొడవ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇద్దరూ సివిల్ కోర్టు కి వెళ్ళి టైటిల్ సూట్ ఫైల్ చేయాలి. ఆ టైటిల్ ద్వారా ఓనర్ ఎవరో తేల్చుకోవాలి.
అంతే కాకుండా కేవలం 12 సంవత్సరాలు ఉండి, ప్రాపర్టీ టాక్స్ కడితే మాత్రమే ఓనర్ షిప్ హక్కులు వస్తాయి అని అనుకోకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక సంవత్సరం మాత్రమే ఉండి, ప్రాపర్టీ టాక్స్ కట్టినా కూడా ఆ ఇల్లు ఆ వ్యక్తి పేరు మీదకే వస్తుంది.
ఒకవేళ 12 సంవత్సరాలు ఉండి ప్రాపర్టీ టాక్స్, వాటర్, కరెంట్ ఓనర్ పేరు మీద ఉన్నా ఆ ఇల్లు ఆ అద్దెకి ఉన్న వ్యక్తికి సొంతం అవ్వదు. కానీ 12 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు కాబట్టి వారిని ఇల్లు ఎవరూ ఖాళీ చేయించలేరు. అలా 12 సంవత్సరాలకంటే ఎక్కువగా ఒక ఇంట్లో ఉన్న వారిని అడ్వర్స్ టెనెంట్ అని అంటారు.
watch video :
https://youtu.be/rFsR-nyGAFU
End of Article