Ads
మనకి కొన్ని విషయాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. కానీ వాటి గురించి తెలిసిన తర్వాత “అవునా! వీటి వల్ల ఇంత ఉపయోగం ఉందా?” అనిపిస్తుంది. మామూలుగా మనలో చాలా మందికి ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలా ఏదైనా సమస్య వచ్చిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళలేము. దాంతో సమస్య చిన్నది అయినప్పుడు దానికి ఇంట్లోనే ఏదో ఒక విధంగా పరిష్కారం వెతకడానికి ప్రయత్నిస్తాము.
Video Advertisement
ఒక్కొక్కసారి మనకి చాలా సమస్యలకు సంబంధించిన చిట్కాలు ఇంట్లోనే దొరుకుతాయి. అలా చాలా మంది చేసే ఒక పని, పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోవడం. ఇది వినడానికి వింతగా ఉన్నా కూడా చాలా మంది కాళ్ల మధ్యలో దిండు పెట్టుకొని పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే.
# దిండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని పడుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
# మనలో చాలా మందికి గురక సమస్య ఉంటుంది. అలా దిండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని పడుకోవడం వలన గురక తగ్గుతుంది.
# మోకాళ్ల మీద ఉండే ఒత్తిడి తగ్గుతుంది.
# మనలో చాలా మందికి నిద్రలో సరైన విధంగా పడుకోకపోవడం వల్ల ఎముకలు పట్టేయడం, లేదా మెడ పట్టేయడం, లేదా చేతులు, కాళ్ళ నరాలు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే సరైన స్లీపింగ్ పొజిషన్ లో పడుకోవడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది.
End of Article