Ads
మనం ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్లాలంటే వాహనాలని ఉపయోగిస్తాం. అందులోనూ ఎక్కువగా వాడేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కూడా చాలా మంది ప్రయాణించడానికి ప్రాధాన్యత ఇచ్చే వాహనం బస్. మెట్రో ట్రైన్ రాకముందు ఎక్కువగా జనాలు బస్సులోనే ప్రయాణించే వాళ్ళు. మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత కూడా ఆ ట్రైన్ వెళ్ళని చోటకి బస్సులోనే ప్రయాణిస్తున్నారు.
Video Advertisement
బస్ అనేవి కేవలం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో మాత్రమే కాకుండా స్కూల్ లేదా కాలేజ్ ట్రాన్స్పోర్ట్ లాగా కూడా ఉపయోగిస్తారు. దీని ద్వారా చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలను స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ దింపే సమయం, అలాగే వారిని అక్కడి నుంచి తీసుకువచ్చే సమయం ఆదా అవుతోంది. అయితే మనం ఒకసారి గమనిస్తే కొన్ని స్కూల్ బస్సులకి సైడ్ కి బ్లాక్ కలర్ లో ఉన్న మూడు గీతలు ఉంటాయి.
అవి మనకి సడన్ గా చూడంగానే గీతలు లాగా కనిపిస్తాయి. కానీ అవి గీతలు కాదు. వాటిని రబ్ రైల్స్ అంటారు. వీటిని మెటల్ తో తయారు చేస్తారు. బస్ కి సైడ్ కి ఉండే ఈ రబ్ రైల్స్, కార్ లాంటి వాహనాలు బస్ కి గుద్దకుండా ఆపుతాయి. ఒకొక్క రబ్ రైల్ బస్ లోని ఒకొక్క భాగాన్ని రక్షిస్తుంది.
అంటే కింద ఉండే రబ్ రైల్, బస్సులో కింద కాళ్లు పెట్టుకునే భాగాన్ని, దానికి కొంచెం పైన ఉండే రబ్ రైల్ సీట్ కింద భాగాన్ని, అలాగే దానికి ఇంకొంచెం పైన ఉండే రబ్ రైల్ సీట్ల పైన ఉండే భాగాన్ని అంటే మనం తల పెట్టుకునే భాగానికి, లేదా విండో కింద ఉండే భాగానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా రక్షిస్తుంది. ఈ రబ్ రైల్స్ ఉండే స్కూల్ బస్సులు ఎక్కువగా విదేశాల్లో ఉంటాయి. మన దగ్గర కూడా ఉంటాయి. కానీ కేవలం కొద్ది చోట్ల మాత్రమే ఇలా రబ్ రైల్స్ ఉన్న బస్సులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బస్సుకి సైడ్ లో ఉండే రబ్ రైల్స్ యొక్క ఉపయోగాలు.
End of Article