Ads
బాగా పని చేసిన తర్వాత శరీరం అలసిపోవడం సహజం. అలా అలసిపోయినప్పుడు కొన్నిసార్లు శరీరంలో కొన్ని భాగాలు ఒత్తిడికి గురవుతాయి. దాంతో, తర్వాత చురుగ్గా పని చేయడం కష్టమవుతుంది. అలా శరీరంలో కొన్ని భాగాలలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించడానికి జపనీయులు కొన్ని చిట్కాలను ప్రవేశపెట్టారు. అవే ఆక్యుపంచర్ థెరపీ. ఈ చిట్కాలను ఇంట్లో కూడా పాటించవచ్చు. మన శరీరంలోని ఏడు భాగాల్లో ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
# ఎడమ చేతి బొటన వేలుని, మధ్య వేలుని కుడి భుజంపై పెట్టి ప్రెస్ చేస్తే శరీర నొప్పులు తగ్గుతాయి అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
# బొటన వేళ్ళని చెవుల వెనుక, మెడ నరాల పక్కన ప్రెస్ చేస్తే అలసట తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల సిగరెట్ అలవాటు ఉన్నవారు ఆ అలవాటు కూడా మానుకుంటారట.
# బొటన వేలికి, చూపుడు వేలికి మధ్య ఉన్న భాగాన్ని ప్రెస్ చేస్తే, ముఖ భాగంలోని నొప్పులు, వెన్ను నొప్పులు, పంటి నొప్పులు, అలాగే తలనొప్పి కూడా తగ్గుతాయి.
# ఛాతి భాగం దగ్గర ప్రెస్ చేయడం ద్వారా బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే మెదడు కూడా చెడు ఆలోచనల వైపు మళ్లకుండా చురుగ్గా పని చేస్తుంది. ఆందోళనలు కూడా తగ్గుతాయి.
# చెవిలోని పైన భాగాన్ని సున్నితంగా ప్రెస్ చేస్తే, మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి తగ్గుతుంది.
# మోకాలి దగ్గర ప్రెస్ చేస్తే కడుపులో తిప్పడం, వాంతులు అవ్వడం వంటి సమస్యలు తగ్గుతాయి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయట.
# కాలి బొటనవేలు ఎముక భాగం దగ్గర ప్రెస్ చేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే నిరాసక్తత, నిద్రలేమి, నడుము నొప్పి కూడా తగ్గుతాయి.
End of Article