Ads
ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బయట గాలి పీల్చడం కూడా కష్టమైపోయింది. వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేకపోతున్నాం. ఇంక తుమ్ము వచ్చిన ప్రతిసారి అది కరోనా వైరస్ వల్ల వచ్చిన తుమ్ము ఏమో అనే అనుమానం కూడా వస్తోంది. అలా తుమ్మినా, దగ్గినా కూడా భయపడుతున్నాం. ప్రభుత్వం అందరినీ వ్యాక్సిన్ తీసుకోమని సూచిస్తోంది.
Video Advertisement
ప్రముఖులు కూడా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే, చాలా మందికి వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ ఎలాంటి వాళ్ళు, ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
# ఒకవేళ ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వస్తే, ఆ వ్యక్తి కోలుకున్న 3 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి.
# ఒకవేళ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్ వస్తే, వారు రెండో డోస్ తీసుకునే ముందు రెండు నెలలు ఆగాలి.
# ఒకవేళ ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగితే, లేదా ఐసీయూలో చేరితే ఆ వ్యక్తి 1 లేదా 2 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి.
# పాలు ఇచ్చే తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
# జ్వరం లేదా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే, వారు కోలుకున్న 15 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
# రక్తదానం చేస్తే ఆర్టీపీసీఆర్ (RTPCR) టెస్ట్ లో నెగటివ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
# కోవీషీల్డ్ యొక్క రెండవ డోస్ ని, మొదటి డోస్ తీసుకున్న 84 నుండి 120 రోజుల తర్వాత తీసుకోవచ్చు.
# కోవ్యాక్సిన్ యొక్క రెండవ డోస్ ని, మొదటి డోస్ తీసుకున్న 28 నుండి 48 రోజుల తర్వాత తీసుకోవచ్చు.
End of Article