Ads
ఇప్పుడు ఉన్న జీవన విధానాన్ని బట్టి మనిషి యొక్క ఆహార అలవాట్లు కూడా మారుతున్నాయి. ఎంతో మంది డైటింగ్ పేరుతో తమకు నచ్చిన ఫుడ్ కి దూరంగా ఉంటున్నారు. అన్నం మానేసి వాటి స్థానంలో ఏదైనా టిఫిన్ ని తీసుకుంటున్నారు. అంతకుముందు మధ్యాహ్నం రాత్రి అన్నం తినే వాళ్ళు.
Video Advertisement
ఇప్పుడు మధ్యాహ్నం పూట మాత్రమే, అది కూడా కొంచెం మోతాదులో అన్నం తీసుకుంటున్నారు. అయితే, ఈ టిఫిన్ లలో కూడా మనం ఎక్కువగా తీసుకునేది చపాతీ. చపాతీ తీసుకోవడం వల్ల శక్తి రావడంతో పాటు వెయిట్ లాస్ కూడా అవుతుంది. దాంతో ఎక్కువ మంది డైట్ లో ఉన్నప్పుడు చపాతీ తీసుకోవడానికి ఇష్టపడతారు.
డాక్టర్లు కూడా డైట్ చేసేవారికి చపాతీ తీసుకోమని ఎక్కువగా సూచిస్తారు. ఇంక అందరికీ అయితే మామూలుగా రాత్రి పూట చపాతీ తీసుకోమని ఎక్కువగా సలహా ఇస్తూ ఉంటారు. అయితే, చపాతీ తీసుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
# పని వల్ల రాత్రి భోజనం ఆలస్యంగా చేసే వారు చాలా మంది ఉంటారు ఆ తర్వాత వెంటనే నిద్రపోతారు కానీ భోజనం చేయడానికి నిద్రపోవడానికి మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అలా గ్యాప్ తీసుకోవడం కుదరని వాళ్ళకి అయితే చపాతీ చాలా ఉత్తమమైన ఆప్షన్.
# ప్లేట్ నిండా భోజనం చేసినా రెండు లేదా మూడు చపాతీలు తీసుకున్నా ఒకటే అని డాక్టర్లు చెప్తారు. అన్నం కంటే చపాతీలు ఎక్కువ శక్తిని ఇస్తాయి.
# చపాతీ నూనెతో కాల్చడం వల్ల రుచిగా ఉంటుంది. కానీ నూనె వెయ్యకుంటే చాలా మంచిది.
# రాత్రి నిద్ర పోయేటప్పుడు మన క్యాలరీలు ఎక్కువగా కరగవు. కాబట్టి మనం రాత్రి తీసుకున్న ఆహారం కొవ్వుగా ఏర్పడుతుంది. దాని వల్ల మనిషి బరువు పెరుగుతారు. గోధుమలలో కొవ్వు పదార్థాలు ఉండవు. అంతే కాకుండా విటమిన్ బి, విటమిన్ ఈ, కాపర్, జింక్, మాంగనీస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో మినరల్స్ ఉంటాయి. కాబట్టి రాత్రి చపాతీ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది.
# చపాతీ తినడం వలన రక్తహీనత కూడా తగ్గుతుంది. గోధుమలలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
End of Article