Ads
మన ఆరోగ్యానికి మంచిది అనే చెప్పే వాటిలో రెండు ముఖ్యమైన పదార్థాలు వెన్న, నెయ్యి. ఈ రెండు తరచుగా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని, శక్తి వస్తుంది అని చెప్తారు. కానీ నెయ్యి, వెన్నలో ఏది ఎక్కువ మంచిది అనేది అందరికీ సహజంగా వచ్చే అనుమానం. నెయ్యి, వెన్నలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
ఆయుర్వేద నిపుణులు చెప్పిన దాని ప్రకారం వెన్న దగ్గు, హెమరాయిడ్స్, ఏమాసియేటింగ్ డిసీజెస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణశక్తి కూడా బాగుంటుంది. ఇంక నెయ్యి విషయానికి వస్తే, నెయ్యి తెలివి తేటలను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అరుగుదలకి కూడా సహకరిస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కంటిచూపు, జీవితకాలం పెరగడానికి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. నెయ్యి వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం తేలికగా గ్రహించగలుగుతుంది. లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉన్నవారు నెయ్యిని తీసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. వెన్న కంటే కూడా నెయ్యి వల్ల లాభాలు చాలా ఉంటాయి. నెయ్యితో పోల్చి చూస్తే వెన్నలో సాచ్యురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి.
వీటి వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. నెయ్యి కాన్స్టిపేషన్ సమస్యను తగ్గిస్తుంది. కానీ వెన్న కాన్స్టిపేషన్ సమస్యను పెంచుతుంది. డైరెక్ట్ గా పాల నుండి తయారు చేసే నెయ్యి మంచిది కాదు. కఫం ఉన్న వాళ్లు నెయ్యిని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్పారు. నెయ్యి, వెన్నలో దేని వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.
End of Article