Ads
ఇల్లు కట్టడం అంటే చిన్న విషయం కాదు. అందులో చాలా అంశాలు ఉంటాయి. ఎన్నో పదార్థాలను వాడాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యమైనది ఇసుక. ఇసుక సరిగ్గా ఉంటే, ఇంటి నిర్మాణం అంత బలంగా అవుతుంది. అయితే, మీకు ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా?
Video Advertisement
అది ఏంటంటే, మనం ఇంటి నిర్మాణంలో ఎడారిలోని ఇసుకని కానీ, సముద్రం దగ్గర ఉండే ఇసుకని కానీ వాడము. దీని వెనకాల ఒక బలమైన కారణమే ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇంటి నిర్మాణం బలంగా ఉండాలి అంటే ఇసుక బాగుండాలి. ఇసుకలోని ఒక రేణువు (పార్టికల్) కి మరొక రేణువుకి మధ్య గరుకుగా అనిపించాలి. అప్పుడే ఆ ఇసుక ఇంటి నిర్మాణంలో వాడిన ఇనుపకి అలాగే ఇటుకలకి, సిమెంట్ కి పట్టి ఉంటుంది. దీనిని ఇంటర్ లాకింగ్ ఏర్పడటం అంటారు.
సముద్రంలో ఉండే ఇసుక మెత్తగా ఉంటుంది. ఇసుక ఒక రేణువుని మరొకటి పట్టి ఉంచేలేక జారిపోతుంటాయి. కాబట్టి వీటి మధ్య ఇంటర్ లాకింగ్ ఏర్పడడం కష్టం.
ఇంకొక విషయం ఏంటంటే, సముద్రంలోని ఇసుకలో ఉప్పు ఉంటుంది. ఉప్పులో క్లోరైడ్ ఉంటుంది. క్లోరైడ్ వల్ల ఇనుప, స్టీల్ తొందరగా తుప్పు పడుతుంది. అలాగే ఇసుకకి, సిమెంట్ కి మధ్య ఉన్న బాండింగ్ ని కూడా దెబ్బ తీస్తుంది. ఇసుకలో ఉప్పు కణాలతో పాటు, దుమ్ము, మృత కణాలు కూడా ఉంటాయి. వీటన్నిటినీ తొలగించడం శ్రమతో మాత్రమే కాదు ఖర్చుతో కూడా కూడుకున్న పని.
ఒకవేళ సముద్రంలోని ఇసుకతో ఇల్లు కట్టినా కూడా వాతావరణంలో ఉన్న తేమని ఉప్పు పీల్చుకుని ఆ గోడలు చెమ్మగా అవుతాయి. అలా సముద్రంలో దొరికే ఇసుకతో కట్టిన కట్టడం 5 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం ఉండలేదు. ఎడారిలో ఇసుక కూడా సన్నగా, గుండ్రంగా, స్మూత్ గా ఉండడంతో, వాటి మధ్య బాండింగ్ ఉండదు. దాంతో నిర్మాణంలో ఉపయోగించేటప్పుడు ఆ ఇసుక జారిపోతూ ఉంటుంది. అందుకే సముద్రంలో, ఎడారిలో ఉండే ఇసుకను నిర్మాణాల్లో ఉపయోగించరు.
End of Article