Home Sports Adda Tamanna Vahi: ఎక్కడ చూసినా ఈమె గురించే.. ఈ ఐపీఎల్ బ్యూటీ ఎవరు..?

Tamanna Vahi: ఎక్కడ చూసినా ఈమె గురించే.. ఈ ఐపీఎల్ బ్యూటీ ఎవరు..?

by Anudeep

ఐపీఎల్ అనగానే మ్యాచ్ లు, వికెట్లు మాత్రమే కాదు.. యాంకర్లు కూడా గుర్తొస్తూ ఉంటారు. స్పోర్ట్స్ యాంకర్లకు కూడా ఎక్కడలేని పాపులారిటీ ఉంటుంది. సాధారణం గా స్పోర్ట్స్ యాంకర్ అనగానే ఠకీమని గుర్తొచ్చేవారు సంజనా గణేషన్, మయాంతి లాంగర్, అర్చనా విజయ్ లు గుర్తొస్తారు. తాజాగా.. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ లో తమన్నా వాహి సందడి చేస్తున్నారు.

tamanna vahi 1

ప్రస్తుతం ఐపీఎల్ ప్లాట్ ఫామ్ పై తమన్నా వాహి గురించి ఎక్కువ గా డిస్కషన్ జరుగుతోంది. ఆమె తన గ్లామర్ తో పలువురు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ సీజన్ లో స్పోర్ట్స్ యాంకర్ గా ఆమె తన సత్తా చాటుతోంది. ఆమె గత సంవత్సరం నుంచే తన యాంకరింగ్ తో అలరిస్తోంది. అబుదాబి లో పుట్టి పెరిగిన తమన్నా తన చదువును అక్కడే పూర్తి చేసుకున్నారు.

tamanna vahi 2

కేవలం ఐపీఎల్ కె కాదు, ఇతర ప్రోగ్రాములకు కూడా ఆమె యాంకరింగ్ చేస్తోంది. యూఏఈ లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు తమన్నా వాహి యాంకరింగ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా లో కూడా ఈమె ఆక్టివ్ గానే ఉంటారు. ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అవుట్ ఫిట్ లతో ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ను నింపేస్తూ ఉంటారు. ఓవైపు యాంకరింగ్, మరోవైపు బ్లాగింగ్ తో తమన్నా దూసుకెళ్తోంది.

tamanna vahi 3

అంతేకాదు 2017 లో ‘బెస్ట్‌ ఏషియన్‌ యూఏఈ బ్లాగర్‌’ అవార్డు ను కూడా సొంతం చేసుకుంది. ఈమె మంచి భోజన ప్రియురాలట. అంతే కాదు ఫిట్ నెస్ విషయం లో కూడా నిక్కచ్చి గా ఉంటుంది. ఇక బాలీవుడ్ సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టమట. అదన్నమాట.. ఒక్కసారి గా ఐపీఎల్ యాంకర్ అవడం తో ఆమె గురించి దేశం లో క్రికెట్ అభిమానులంతా చర్చిస్తున్నారు.

You may also like