Home Off Beat “గులాబ్” తూఫాన్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

“గులాబ్” తూఫాన్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

by Mohana Priya

Ads

తుఫాను అనేది సహజంగా వాటిల్లే ఒక ఉపద్రవం. ప్రపంచంలో పలుచోట్ల తుఫానులు వస్తాయి. ప్రతి దాన్ని తుఫాను అని పిలవడం కష్టం. తుఫాను అంటే ఏ తుఫాను అనేది సులువుగా అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రతి తుఫానుకి ఒక పేరు పెడుతున్నారు. అసలు ఈ పేర్లు ఎలా పెడతారో తెలుసుకుందాం. తుఫాన్లకు పేర్లు పెట్టే పరంపర అధికారికంగా 1945వ సంవత్సరం నుండి మొదలైంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిన తుఫానుకు అమెరికాలో ఉన్న నేషనల్ హరికేన్ సెంటర్ మొదటిసారిగా పేరు పెట్టారు.

Video Advertisement

తుఫానుకి పేరు పెట్టడానికి కేవలం ఇంగ్లీష్ లెటర్లను మాత్రమే వాడుతారు. ఒక సంవత్సరం A తో మొదలయ్యేలా, ఇంకొక సంవత్సరం B తో మొదలయ్యేలా అలా W వరకు అక్షరాలతో ఒక్కో సంవత్సరం ఒక్కో అక్షరంతో పేరు పెడతారు. కానీ ఇందులో నుండి Q,U అక్షరాలకు మినహాయింపు ఉంది. రేఖాంశాలు, అక్షంశాలకంటే పేర్లతో అయితే సులభంగా గుర్తు పట్టే అవకాశం ఉంటుందని భావించి హిందూ మహాసముద్రానికి చెందిన ఎనిమిది దేశాలు కలిసి 2004 లో పేర్ల జాబితాను తయారు చేశారు.how did gulab thoofan get the name

సెప్టెంబర్ లో హిందూ మహా సముద్రంలో సంభవించిన తుఫానుకి ఓనిల్ అని పేరు పెట్టారు. ఈ పేరుని బంగ్లాదేశ్ సూచించింది. ఇండియాని ఆనుకొని ఉన్నబంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫాన్లలో అన్నిటికీ కాకుండా కేవలం 34 నాట్స్ కంటే గాలుల వేగం ఎక్కువగా ఉన్న తుఫాన్లకి మాత్రమే పేరు పెడుతున్నారు. ఒక్కొక్క దేశానికి 8 పేర్లు సూచించే వీలు ఉంటుంది. ఇప్పటిదాకా ఇలా ఒక్కో దేశం సూచించిన 8 పేర్లతో 2 లిస్టులు పూర్తయ్యాయి. 2014 లో విశాఖపట్నంలో వచ్చిన హుద్‌‌హుద్ తుఫాను అందరికీ గుర్తుండే ఉంటుంది.how did gulab thoofan get the name

ఆ పేరును పెట్టింది ఒమన్. హుద్‌‌హుద్ అనేది ఇజ్రాయిల్ లో ఒక పక్షి పేరు. 2016లో బంగాళాఖాతంలో వచ్చిన తుఫాను మాల్దీవులు రోను అని పేరు పెట్టింది. 2016 లోనే అండమాన్, చెన్నై, కర్ణాటక, గోవాలో వచ్చిన తుపానుకు పాకిస్తాన్ వార్థా అని పేరు పెట్టింది. వార్థా అంటే ఎర్ర గులాబీ. గజ పేరుని శ్రీలంక సూచించింది. తిత్లీ పేరుని పాకిస్తాన్ సూచించింది. గత సంవత్సరం వచ్చిన తుపానుకు బంగ్లాదేశ్ థాయి భాషలో ఆకాశం అని అర్థం వచ్చేలా అంఫన్ అనే పేరును పెట్టింది.how did gulab thoofan get the name

2018 సంవత్సరం నుండి పేర్లు పెట్టే దేశాలు 8 నుండి 13 దేశాలుగా మారాయి. కాబట్టి ఒక్కో దేశం 13 పేర్లను సూచించాలి అని నిర్ణయించారు. 2019లో ఆ పేర్లను పరిశీలించి, 2020లో అధికారికంగా పేర్లను ప్రకటించారు. 2020 జూన్ లో వచ్చిన తుఫానుకు నిసర్గ్ అని బంగ్లాదేశ్ పేరు పెట్టింది. ఏ దేశం నుండి పేరు సూచించినా వేరే దేశాల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండే పేర్లను పరిశీలించి ఎన్నుకుంటారు.

how did gulab thoofan get the name

గులాబ్ కంటే ముందు భారత దేశంలో వచ్చిన తుఫాన్ పేరు 2020 లో సూచించిన లిస్ట్ ప్రకారం యాస్ అని పెట్టారు. ఈ పేరుని ఒమన్ సూచించింది. ఇప్పుడు వచ్చిన తుఫానుకి గులాబ్ అనే పేరు పెట్టారు. ఇది లిస్ట్ లో 7వ పేరు. దీనిని పాకిస్తాన్ సూచించింది. ఇప్పుడు తర్వాత రాబోయే తుఫానుకి షాహీన్ అనే పేరు పెడతారు. ఇలా ఒక్కొక్క తుఫాన్ కి పేరు పెట్టడం వెనుక ఇంత చర్చ జరుగుతుంది.


End of Article

You may also like