ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో నుంచి నురగ ఎందుకు బయటకు వస్తుంది..? అసలు కారణం ఇదే..!

ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో నుంచి నురగ ఎందుకు బయటకు వస్తుంది..? అసలు కారణం ఇదే..!

by kavitha

Ads

ఫిట్స్ గురించి అందరికి తెలిసిందే. నరాల వీక్ నెస్ ఉన్నవారు ఎక్కువగా ఫిట్స్ కి లోనవుతూ ఉంటారు. ఆ సమయంలో స్పృహ ఉండదు. పట్టు తప్పి నేలపై పడిపోతూ ఉంటారు. అయితే.. ఫిట్స్ వచ్చినప్పుడు కనిపించే మరో సాధారణ లక్షణం ఏంటంటే నోటిలోంచి నురగ రావడం. కొంతమంది లో ఫిట్స్ తరచుగా వస్తూ ఉంటాయి. అలా వచ్చేవారు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. మీరెప్పుడైనా గమనించారా..? ఫిట్స్ వచ్చేవారిలో చాలా మందికి నోటి నుంచి నురగ వస్తూ ఉంటుంది.

Video Advertisement

fits 1

అయితే ఫిట్స్ వచ్చినప్పుడు నోటి నుంచి నురగ ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. చూసేవారికి ఇది కొంచం భయం కలిగించినా.. నురగ రావడానికి మాత్రం కారణం చాలా చిన్నది. సాధారణంగా ప్రాణం ఉన్నంతసేపు మనుషుల నోటిలో లాలాజలం ఊరుతూ ఉంటుంది. అయితే.. మనం దాని గురించి పట్టించుకోకపోయినా ఇది నోటినుంచి కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది.

fits 2

మనం గుటక వేసినప్పుడు ఈ లాలాజలం కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. కానీ, ఇది మన ఎరుకలో ఉండదు. అయితే ఫిట్స్ వచ్చిన సమయంలో.. మనుషులు గుటక వెయ్యలేరు. ఫలితంగా ఈ లాలాజలం అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల నుంచి కూడా గాలి నోటి ద్వారా బయటకు వస్తుంది. ఒకేసారి లాలాజలం, గాలి కలిసి రావడంతో నురగ ఏర్పడుతుంది. నిజానికి ఇది చాల చిన్న కారణం. ఇదేమీ ప్రమాదకరం కాదు. కానీ, ఫిట్స్ వచ్చిన వ్యక్తిని సాధ్యమైనంత తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లడం ఉత్తమం.


End of Article

You may also like