Ads
ఈ మధ్యకాలంలో అంతరిక్షానికి విహార యాత్రల కింద కూడా వెళ్లడం జరుగుతోంది. భవిష్యత్తులో చూసుకున్నట్లయితే సెలవులను ఎంజాయ్ చేయడానికి అంతరిక్షానికి కూడా వెళ్లేలా.. కనబడుతుంది. అయితే అంతరిక్షంలో జీవించడం ఎలా అన్న దానిపై కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ అంతరిక్షానికి వెళ్ళి… అక్కడ చనిపోతే పరిస్థితి ఏమిటి…? వామ్మో ఏమవుతుందా అని అనుకుంటున్నారా..? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Video Advertisement
సాధారణంగా భూమిపై ఎవరైనా మరణిస్తే దేహం దశలవారీగా కుళ్ళిపోతుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఉండే వాతావరణం, ఉష్ణోగ్రతను బట్టి మృత దేహం లో మార్పులు వస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే అంతరిక్షంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చూస్తే…. ఇతర గ్రహాల్లోని గురుత్వాకర్షణశక్తి లో వైరుధ్యాలూ లివోర్ మోర్టిన్ దశ పై ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ కనుక గురుత్వాకర్షణశక్తి లేదు అంటే దేహంలోని రక్తం పోగుపడదు. అదే విధంగా చనిపోయిన వ్యక్తి స్పేస్ సూట్ వేసుకున్నా సరే పేగులోన్ బ్యాక్టీరియా మృత కణజాలాన్ని తీసివేయడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా పని చేయడానికి ఆక్సిజన్ అవసరం. ఈ వాయువు పరిమితంగా ఉంటే ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
అదే విధంగా భూమిలో ఖననం చేసిన మృతదేహాన్ని కొల్లగొట్టే ప్రక్రియలో నెల మీద వుండే కొన్ని సూక్ష్మజీవులు సహాయం చేస్తాయి. కానీ ఇతర గ్రహాల్లో ఇలాంటివి జరగవు. అలానే చంద్రుడిపై ఉష్ణోగ్రతలు 120 డిగ్రీల నుంచి 170 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. అందువల్ల వేడి లేదా శీతల ప్రక్రియతో కలిగే నష్టం మృతదేహంపై కూడా పడుతుంది. జీవించి ఉన్నప్పుడు ఎముకలు సజీవ పదార్థాలే వాటిలో కర్బన, అకర్బన పదార్థాలు ఉంటాయి అనే సంగతి తెలుసు అయితే సాధారణంగా కర్బన పదార్థాలు కుళ్లిపోతాయి. అకర్బన పదార్థాలు అస్థిపంజరాలగా మిగిలిపోతాయి. కానీ ఇతర గ్రహాల్లో తీవ్ర ఆమ్లత్వం తో కూడిన పరిస్థితుల్లో దీనికి భిన్నంగా జరగడం అకర్బన పదార్థాలు అంతర్థానమై మృదువు కణజాలం మిగిలిపోతుంది. చూశారా అంతరిక్షంలో చనిపోతే ఎన్ని మార్పులు వస్తాయో.
End of Article