Ads
చాలా మందికి పచ్చబొట్టు అంటే ఇష్టం. వివిధ రకాల డిజైన్లని తమకి నచ్చిన శరీర భాగాల మీద వేయించుకుంటూ వుంటారు. అయితే పచ్చబొట్టు ఉన్న వాళ్లని భారత సైన్యానికి అనుమతించరా…? మరి ఈ రోజు ఈ ఆసక్తికరమైన టాపిక్ ని చూద్దాం.
Video Advertisement
భారత సైన్యానికి ఒక టాటూ పాలసీ అనేది ఉంది. 2015లో దీనిని సవరించిన వెర్షన్ వచ్చింది. దాని ప్రకారమే ఫాలో అవ్వడం జరుగుతుంది.
ఈ సందర్భాలలో పచ్చబొట్టు ఉన్న వారిని అనుమతిస్తారు:
భారత సైన్యానికి ఎంపిక అవ్వాలని వచ్చిన వ్యక్తికి పచ్చబొట్టు వున్నా ఈ సందర్భంలో ఒప్పుకుంటారు. అయితే ఆ వ్యక్తి భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా షెడ్యూల్ కాస్ట్ కి చెందిన అతను అయ్యి ఉండాలి. అప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారం శరీరంలో ఏ భాగంలోనైనా ఏ రూపంలో అయినా పచ్చబొట్టును వేసుకోవాల్సి ఉంటే అటువంటి వాళ్ళని అనుమతిస్తారు. అయితే వారికి ఆ ఆచారం వుంది అని పత్రాన్ని సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది.
అదే విధంగా ఇతర వ్యక్తులకి చేతుల పై కొన్ని అనుమతించిన ప్రదేశాలలో పచ్చబొట్టు ఉండొచ్చు. ఇక్కడ మార్క్ చేసిన విధంగా ఎవరికైనా టాటూ ఉండొచ్చు. ఇలా ఇక్కడ చెప్పుకున్నట్లు ఈ రెండు కారణాల వలన పచ్చబొట్టు ఉంటే అనుమతిస్తారు.
రేసిస్ట్, ఇండీసెంట్ గా అస్సలు వుండకూడదు. అలానే ఇతరులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా ఉండకూడదు. అయితే ఎవరికైనా పచ్చబొట్లు ఉంటే అది ఉండొచ్చా లేదా అనేది సెలక్షన్ సెంటర్ కమాండెంట్ లేక ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడెమీ నిర్ణయిస్తుంది. అలానే ఆర్మీలో చేరక ముందు ఆర్మీ డాక్టర్లు కూడా వాటిని చూస్తారు. అవి సురక్షితమా కాదా, వాటి వల్ల చర్మ సమస్యలు వస్తాయా లేదా అన్నది కూడా వాళ్ళు చెబుతారు. మీరు భారత సైన్యం యొక్క టాటూ పాలసీ 2015 చూస్తే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి.
End of Article