సినిమా కథలను ఎంచుకొనే విషయం లో ఆచి తూచి వ్యవహరిస్తాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీ లో మొదటి ప్లేస్ లోనే ఉన్నాడు. ట్రెండ్ కి తగ్గట్టుగా, ఫాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని కథలు ఎంచుకుంటాడు చిరు. అయితే ఆయన కెరీర్ లో కూడా కొన్ని ప్లాప్స్, కొన్ని యావరేజ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే మంచి మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి గతం లో ‘ డాడీ’ అనే ఫామిలీ ఓరియెంటెడ్ చిత్రం లో నటించారు.

Video Advertisement

2001 లో వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తన ఫ్యామిలీ కి దూరమైన హీరో.. తిరిగి వారిని ఎలా చేరుకున్నాడు అన్నదే.. ఈ చిత్రం. ఈ సినిమా ఆధ్యంతం ఎమోషనల్ గా సాగుతుంది. అయితే ఈ చిత్ర విడుదల తర్వాత చిరంజీవికి ఎదురైన ఒక అనుభవాన్ని ఆయన ఒకసారి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ సంఘటన తర్వాత మళ్ళీ అటువంటి సినిమాలు తీయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు చిరు వెల్లడించారు.

did chiru gets this kind of requests afrer daddy movie..!!

ఒకసారి చిరు ఒక పని మీద దుబాయ్ వెళ్లగా.. అక్కడ విమానాశ్రయం లో ఒక పెద్దావిడ ఆయన్ని పలకరించిందట.. దానికి కొద్ది రోజుల ముందే ‘డాడీ’ చిత్రం విడుదలైంది. ఆమె కాసేపు మాట్లాడిన తర్వాత.. “మీరు డాడీ లాంటి చిత్రాల్లో నటించకండి” అని సున్నితంగా చెప్పిందట. “ఎందుకు?” అని చిరు అడగ్గా.. “అందులో మీరు ఏడుస్తారు కదా.. అందుకే .. కావాలంటే మమ్మల్ని ఏడిపించండి.. కానీ మీరు ఏడవకండి” అని ఆమె చెప్పిందట. అప్పటి నుంచి అలాంటి కథలకు దూరం గా ఉంటున్నట్లు ఆయన గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

did chiru gets this kind of requests afrer daddy movie..!!

అంతే కాకుండా ఇటీవల ఆచార్య ప్రమోషన్స్ లో భాగం గా చిరంజీవి డాడీ చిత్రం గురించి మాట్లాడుతూ.. ” నాకు రచయిత భూపతి రాజా డాడీ కథ వినిపించగానే.. ఈ కథ వెంకటేష్ కి బాగా సరిపోతుందని ఆయనకు చెప్పాను. కానీ నేను ఫామిలీ మాన్ గా డిఫరెంట్ గా ట్రై చెయ్యాలని ఆయన నన్ను కన్విన్స్ చేసారు. కానీ రిసల్ట్ కూడా అలాగే వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక వెంకటేష్ నాకు ఫోన్ చేసి ‘ భలే సినిమా అండి .. నేను చేస్తే ఇంకా బాగా ఆడేది’ అని అన్నారు. నేను అదే అనుకున్నాను అని చెప్పాను. ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ నా జీవితం లో ఉన్నాయి.” అని చిరు డాడీ చిత్రం గురించి చెప్పుకొచ్చారు.