“ఆరోజుల్లో మీరెలా బతికారు నాన్నా..?” అని ఈ కొడుకు అడిగిన ప్రశ్నకి ఆ తండ్రి ఇచ్చిన సమాధానం వింటే షాక్ అవుతారు..!

“ఆరోజుల్లో మీరెలా బతికారు నాన్నా..?” అని ఈ కొడుకు అడిగిన ప్రశ్నకి ఆ తండ్రి ఇచ్చిన సమాధానం వింటే షాక్ అవుతారు..!

by Harika

Ads

తండ్రి కొడుకుల బంధం అనేది ఎప్పటికి తెగిపోనిది. ఎన్ని గొడవలు వచ్చినా, మనస్పర్థలు వచ్చినా.. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం ఉంటూనే ఉంటాయి. అయితే.. తండ్రి కొడుకులు ఇద్దరికీ ఉండే జనరేషన్ గ్యాప్ కారణం గానే అనేక గొడవలు, మనస్పర్థలు తలెత్తుతూ ఉంటాయి.

Video Advertisement

ఓ కొడుకు.. ఆ జనరేషన్ గ్యాప్ వలన వచ్చిన సందేహాలతోనే తన తండ్రిని ఇలా ప్రశ్నించింది.. నాన్నా.. మీరోజుల్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ, ఇంటర్నెట్ సౌకర్యాలు, విమానాలు, కంప్యూటర్లు, ఏసీలు లాంటివి ఏమీ లేవు.

father 1

అసలు లగ్జరీ లైఫ్ ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు. అసలు ఆరోజుల్లో మీరెలా బతికారు నాన్నా..? అంటూ ప్రశ్నించాడు. కొడుకు అడిగిన ప్రశ్న విన్న తండ్రి చిరు నవ్వుతో కొంచం ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. ఈరోజుల్లో దేవుడిని ప్రార్ధించకుండా, బంధాలకు విలువ ఇవ్వకుండా, పెద్దలకు గౌరవం ఇవ్వకుండా, ప్లానింగ్ మరియు క్రమ శిక్షణ లేకుండా, మర్యాదలు లేకుండా మీరు ఎలా బతుకుతున్నారో.. మా రోజుల్లో అవి అన్నీ పాటిస్తూ మేము అలానే బతికాము.

father 2

మీలాగా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ లు ధరించాల్సిన అవసరం రాలేదు. స్కూల్ టైమింగ్స్ అయిపోయాక కూడా చీకటి పడేదాకా ఆడుకునేవాళ్ళం. నెట్ లో ఉండే స్నేహాల కంటే.. నిజమైన స్నేహాలతోనే కాలం గడిపాము. బాటిల్ వాటర్ అప్పుడు అసలు లేదు. కుళాయిలోనే తాగేసేవాళ్ళం. ఒకే గ్లాస్ లో నలుగురు జ్యూస్ తాగినా ఎప్పుడు ఎవరికీ ఏ రోగాలు రాలేదు. మూడు పూటలా అన్నమే తినేవాళ్ళం అయినా ఎవరికీ ఊబకాయం రాలేదు.

father 3

షూస్ అనేవే లేవు. ఉత్తి పాదాలపైనే పరిగెత్తే వాళ్ళం. అయినా ఎవరికీ ఎలాంటి కీళ్ల నొప్పులు వచ్చేవి కాదు. మా స్నేహితుల ఇంటికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి వారింట తినుబండారాలను కూడా హాయిగా తినేసేవాళ్ళం. మా ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండొచ్చు గాక.. కానీ, మా మధుర స్మృతులన్నీ రంగుల్లోనే ఉన్నాయి. మా తల్లి తండ్రులు చెప్పింది విని ఆచరించిన చివరి తరం, మా పిల్లలు చెప్పిన శాసనాలు పాటిస్తున్న మొదటి తరం మాదే అయి ఉంటుందేమో. మీ యాంత్రిక జీవితాలకు తోచినంత సాయం చేస్తున్నాం.. మేము వెళ్లిపోకముందే మా నుంచి ఎంతో కొంత నేర్చుకోండి అంటూ ఆ తండ్రి సమాధానం ఇచ్చాడు.


End of Article

You may also like