NARA BRAHMANI: మూడు రోజులుగా వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక కథ ఏంటంటే.? ఈ ఫోటో ఎక్కడ అంటే.?

NARA BRAHMANI: మూడు రోజులుగా వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక కథ ఏంటంటే.? ఈ ఫోటో ఎక్కడ అంటే.?

by Sainath Gopi

Ads

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, మాజీ మినిస్టర్ నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి గురించి కొత్త పరిచయం అక్కర్లేదు అనుకుంట. మహిళా సాధికారత సాధన లక్ష్యంగా హైదరాబాద్ లో మార్చ్ 17 న తనైరా అనే బెంగళూరుకు చెందిన ఫిట్నెస్ సంస్థ శారీ రన్ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు చీరకట్టుతో ఈ పరుగులో పాల్గొన్నారు.హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ఈవెంట్ కి సంబందించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Video Advertisement

ట్విట్టర్ లో నారా బ్రాహ్మణి ఈ విధంగా పోస్ట్ చేసారు..”తనైరా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం జరిగిన శారీ రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించాను. ఆత్మవిశ్వాసంతో వివిధ రంగాల్లో విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న వందలాది మహిళలను, ధగధగా మెరిసిపోయే రంగురంగుల చీరలు,  కళాత్మకంగా నేసిన ముచ్చటైన చీరలలో చూడటం ఎంతో బాగుంది. చేనేతకు ప్రఖ్యాతిగాంచిన మంగళగిరిలో శ్రమ, ప్రేమ కలగలిపి అక్కడి మహిళలు అల్లిన చేనేత చీరను ధరించి, నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం.”

watch video:


End of Article

You may also like