“కట్నం అడిగితే రిజెక్ట్ చేస్తారు.. కానీ వరుడి జీతం 30 లక్షల ప్యాకేజీ ఉండాలంటారు..” ఇదెక్కడి న్యాయం? ఈ అమ్మాయి చెప్పిన ఆన్సర్ చూస్తే..

“కట్నం అడిగితే రిజెక్ట్ చేస్తారు.. కానీ వరుడి జీతం 30 లక్షల ప్యాకేజీ ఉండాలంటారు..” ఇదెక్కడి న్యాయం? ఈ అమ్మాయి చెప్పిన ఆన్సర్ చూస్తే..

by Anudeep

Ads

పెళ్లి అనేది ఎవరికైనా ముఖ్య ఘట్టమే. అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా అదో కలల తీరం. తాము పెళ్లి చేసుకోబోయే వారు ఎలా ఉండాలి అన్న విషయమై చాలా ఆలోచనలు పెట్టుకుంటుంటారు. అయితే.. సమాజంలో కట్నం వంటివి విషయాలు పాత కాలం నుంచే ఉన్నాయి. ఒక సంబంధం ఫిక్స్ చేసుకునే ముందు కట్న కానుకల గురించి కూడా చర్చించుకుంటూనే ఉంటారు. అయితే.. ఒక్కోసారి ఈ కట్నం అనేది అమ్మాయి తరపు వారికి గుదిబండగా మారుతూ ఉంటుంది.

Video Advertisement

హెచ్చు స్థాయిలో కట్నాలు ఆశించడం వలన అమ్మాయి తరపు తల్లితండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు. ఈ విషయమై అమ్మాయిలు కట్నాలు ఇచ్చే సంప్రదాయాలు రూపు మాపాలంటూ కోరుతూనే ఉంటారు. అయితే.. కట్నాలు అడిగితే చాలా మంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు కూడా. ఇది ఇలా ఉండగా.. కొందరు అమ్మాయిలు తమను చేసుకోబోయే వారి జీతం మాత్రం ఏడాదికి 25 నుంచి 30 లక్షల ప్యాకేజీ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు.

representative image

కట్నం అడిగితే తప్పు అనే వారు.. అబ్బాయిలకి మాత్రం ఇన్ని లక్షల ప్యాకేజీ ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదా.. అని ఓ కోరా యూజర్ ప్రశ్నించారు. ఇందులో ఈక్వాలిటీ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. దీనికి ఓ అమ్మాయి సమాధానం ఇచ్చారు. ఆ అమ్మాయి ఏమి సమాధానం ఇచ్చిందో మీరే చదవండి. ” ఏడాదికి 30 లక్షల జీతం సంపాదించని కారణంగా ఏ అత్తామామలైనా తమ అల్లుడిని చంపేసిన ఘటనని మీరు ఒక్కటైనా చూసారా..? కానీ, కట్నం ఇవ్వని కారణంగా బలి అవుతున్న ఆడపిల్లలు ఎందరు ఉన్నారో తెలుసా?

representative image

ఇప్పటికీ భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో కట్నం ఇవ్వకుండా ఆడపిల్ల అత్తారింటికి వెళితే.. ఆమె జీవితం ప్రమాదంలో పడ్డట్లే. కానీ అబ్బాయిల విషయంలో ఇదే పరిస్థితి ఉందా…? అబ్బాయిలు ఎంత సంపాదించుకున్నా దానికి సంబంధించిన లెక్కలు ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. అది అతని సొమ్మే. కానీ కట్నంగా ఆడపిల్లలు ఎంత తీసుకు వచ్చినా.. పెళ్లి అయిన తరువాత వారికి అందులో రూపాయి కూడా ఇచ్చేవారు ఉండరు. ఆ సొమ్ము భర్త లేదా అత్తమామలు దాచి పెడతారు. అబ్బాయి సంపాదన, కట్నం అనేవి రెండు వేరు వేరు విషయాలు. ఈ రెండిటిని ఎలా ఈక్వలైజ్ చేసి చూస్తారు..?

dowry 4

representative image

తక్కువ శాలరీ వచ్చే అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దు.. అని ఏ భారతీయ చట్టం అయినా చెబుతోందా..? లేదు కాదా.. కానీ, కట్నాలను ఇవ్వొద్దు మరియు తీసుకోవద్దు అని భారత చట్టాల్లో చెప్పబడి ఉంది. అంటే.. కట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పు అనే అర్ధం. అయితే.. చాలా మంది సిస్టంను మిస్ యూజ్ చేస్తున్నారు అన్నది వాస్తవమే. కానీ, కేవలం కొంతమంది కారణంగా ఈ రెండిటిని కంపేర్ చేసుకుని.. కట్నం అడగడం మాత్రం సరైన పద్ధతి కాదు.”

ఈ అమ్మాయి చెప్పిన సమాధానాన్ని మీరు ఏకీభవిస్తారా..? మీ అభిప్రాయం ఏమిటి..?


End of Article

You may also like