Ads
మనం ఒకరికి పంపబోయిన మెసేజ్ మరొకరికి పంపుతూ ఉంటాం. ఒకవేళ అది మామూలు మెసేజ్ అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే ఏదైనా ముఖ్యమైన విషయం అయినా, లేదా ఏదైనా పర్సనల్ విషయం అయినా, పొరపాటున వేరే వాళ్ళకి వెళ్తే మాత్రం అంతే సంగతి. ఇలా ఒక అమ్మాయి, తన బాయ్ ఫ్రెండ్ కి చేయబోయిన మెసేజ్ మరొకరికి చేసింది. అసలు కథేంటో ఆ అమ్మాయి మాటల్లోనే చూద్దాం.
Video Advertisement
“ఆరోజు కాలేజ్ కి హాలిడే అవ్వడంతో, బయటికి వెళ్దాం అనుకున్నాం. కొత్త సినిమా రావడంతో టికెట్స్ బుక్ చేసుకున్నాం. అనుకున్నట్టుగానే సినిమాకి వెళ్ళాం. సినిమా చాలా బాగుంది. తర్వాత ఆకలిగా ఉండటంతో లంచ్ కి వెళ్ళాం. లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు మాట్లాడుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మొన్నటి వరకు ఎగ్జామ్స్ టెన్షన్ ఉండడంతో సరిగ్గా మాట్లాడుకోలేకపోయాం. ఇవాళ ఎందుకో చాలా హాయిగా అనిపించింది.
representative image
ఇదే విషయాన్ని తనకు చెబుదాం అని వాట్సాప్ ఓపెన్ చేశాను. నేను వాట్సాప్ ఎక్కువగా వాడను. చాటింగ్ అయితే చాలా తక్కువ. ఎక్కువగా టెక్స్ట్ మెసేజెస్ వాడతాను. కాంటాక్ట్ వెతికి ఓపెన్ చేసి “Thank you for everything. You made my day so memorable. I love you” అని పంపించాను. మెసేజ్ డెలివరీ అయింది. తర్వాత కొంత సేపటికి నా ఫోన్ లో మెసేజ్ సౌండ్ వచ్చింది. చూస్తే “??” అని ఉంది.
ఇదేంటి రిప్లై ఇలా వచ్చింది? అని ఒకసారి కాంటాక్ట్ సరిగ్గా చెక్ చేశాను. అప్పుడు అర్థమైంది. నేను ఈ మెసేజ్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురికి పంపాను అని. వీళ్ళిద్దరి పేరు A తోనే స్టార్ట్ అవ్వడంతో, కన్ఫ్యూజ్ అయ్యాను. కాంటాక్ట్ లిస్ట్ లో మొదటి పేరు తనది ఉంటుందనుకున్నాను. అందుకే A టైప్ చేయగానే ముందు వచ్చిన పేరుకి మెసేజ్ పంపించాను. కానీ లిస్ట్ లో మొదట ఈ అమ్మాయి పేరు ఉంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
representative picture
ఆ అమ్మాయి ఇంకా ఆన్లైన్లోనే ఉంది. నా రిప్లై కోసం ఎదురు చూస్తోందేమో. ఇంక నేను ఇలా టెన్షన్ పడుతూ కూర్చుంటే, అంతలోపు ఆ అమ్మాయి ఎవరికైనా చెప్తే కష్టం. అందుకే ఇలా రిప్లై ఇచ్చాను. “If you get reply for the above message, that means they are your best friend. I got the reply from you. So you are my best friend” అని రిప్లై ఇచ్చాను. ఈ మెసేజ్ చూసి ఆ అమ్మాయి ఒక స్మైలీ ఎమోజీతో రిప్లై ఇచ్చింది”.
ఇలా ఒక అమ్మాయి పొరపాటున పంపిన మెసేజ్ ని తెలివిగా కవర్ చేసింది. కానీ ప్రతిసారి ఇలా కవర్ చేయలేం. ఇంకా, ఇది ఏదో సరదా సందర్భంలో జరిగింది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన వివరాలు లేదా ఇతర ఇంపార్టెంట్ విషయాలు ఒకరికి పంపబోయి వేరే వారికి పంపితే మాత్రం కష్టమే. అందుకే మెసేజ్ ఏదైనా సరే జాగ్రత్తగా చూసుకొని సెండ్ చేయాలి.
End of Article