14 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన కూతురు.. ఫేస్ బుక్ సాయం తో తల్లి దగ్గరకి.. కళ్ళు చెమర్చే తల్లి కూతుళ్ళ స్టోరీ..!

14 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన కూతురు.. ఫేస్ బుక్ సాయం తో తల్లి దగ్గరకి.. కళ్ళు చెమర్చే తల్లి కూతుళ్ళ స్టోరీ..!

by Anudeep

Ads

ఫేస్ బుక్ వచ్చిన తరువాత చాలా మంది తమ టైం అంతా వృధా అయిపోతోందని.. ఫేస్ బుక్ ను స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నామని భావిస్తూ ఉంటారు. కానీ.. ఏదైనా మంచి, చెడు రెండిటిని అందిస్తుంది. మనం వాడే విధానాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. తాజాగా.. ఓ తల్లి కూతుళ్లను ఫేస్ బుక్ కలిపింది.

Video Advertisement

jacquelin 2

దాదాపు పదునాలుగేళ్ల క్రితం కిడ్నాప్ అయిన కూతురు ఫేస్ బుక్ ద్వారా తన తల్లిని కలుసుకుంది. ఏంజెలికా వెన్సెస్-సల్గాడో అనే మహిళ పదునాలుగేళ్ల క్రితం తన కూతురు జాక్వెలిన్ హెర్నాండెజ్(19) ను పోగొట్టుకుంది. జాక్వెలిన్ ను ఎవరో కిడ్నాప్ చేసారు. ఆ విషయం గురించి జాక్వెలిన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసాడు. ఫ్లోరిడాలోని క్లెర్మాంట్‌లో వారు నివాసం ఉండేవారు. డిసెంబర్ 22, 2007 న కొందరు దుండగులు జాక్వెలిన్ ను అపహరించారు.

jacquelin 3

ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. జాక్వెలిన్ ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయారు. పత్రిక ప్రకటన కూడా చేయించారు. కానీ, జాక్వెలిన్ ఆచూకీ దొరకలేదు. దాదాపు 14 సంవత్సరాల తరువాత జాక్వెలిన్ తన తల్లిని ఫేస్ బుక్ ద్వారా సంప్రదించింది. తాను మెక్సికో లో నివసిస్తున్నానని.. 14 క్రితం కిడ్నాప్ చేయడం వల్ల మీకు దూరమయ్యానని తల్లికి చెప్పుకుంది. అయితే.. ఈ విషయమై సందేహం వ్యక్తం చేసిన ఏంజెలికా ఈ విషయం గురించి పోలీసులకు తెలిపింది.

jacquelin 1

కాగా.. పోలీసులు కూడా ఆమె గురించి పూర్తి ఎంక్వైరీ చేశారు. ఆమె కచ్చితం గా జాక్వెలిన్ అవునా కాదా..? అని తేల్చుకోడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేసారు. ఆమె సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించిన పోలీసులు ఆమె పదునాలుగేళ్ల క్రితం తప్పిపోయిన జాక్వెలిన్ గా నిర్ధారించారు. తాజాగా.. ఈ తల్లి కూతుళ్లు ఇద్దరు మెక్సికో లో అధికారికం గా కలుసుకున్నారు. ఈ విషయాన్నీ జాక్వెలిన్ తండ్రి పాబ్లో ఓ ప్రకటన ద్వారా తెలిపారు..” ఇది చాలా భావోద్వేగభరితమైన ఘటన.. ఇప్పటికైనా మా కథ సుఖాంతమైనందుకు హ్యాపీ గా ఉంది.. తన కోసం చేసిన ప్రార్ధనలు ఎట్టకేలకు ఫలించాయి..” అని పేర్కొన్నారు. ఈ స్టోరీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 


End of Article

You may also like