ప్రాజెక్ట్-K కథతోనే సినిమా తీసి… ఆల్రెడీ ఆ ఫ్లాప్ హీరో “హిట్” కొట్టాడా..?

ప్రాజెక్ట్-K కథతోనే సినిమా తీసి… ఆల్రెడీ ఆ ఫ్లాప్ హీరో “హిట్” కొట్టాడా..?

by Anudeep

Ads

ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కె. ప్రస్తుతం ఈ మూవీ కి రిలేటెడ్ ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేనండి ఇటీవల విడుదలైన ఓ మూవీ స్టోరీ లైన్ తో ప్రాజెక్ట్ కె కి పోలికలు ఉన్నాయి అనేదే ఆ న్యూస్.

Video Advertisement

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఈ మూవీ రెడీ కాబోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ మూవీ కి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి చేయబడ్డాయి.

reason behind prabhas movies disappoing after bahubali

ఇండియాలో ఇంతవరకు రూపొందించని విజువల్ వండర్ గా ప్రాజెక్ట్ కె గుర్తింపు పొడుతుందని చిత్ర యూనిట్ నమకం. అదీ కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా ప్రాజెక్ట్ కె పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ అని ప్రకటించారు. ఇలా దర్శకుడే ప్రకటన ఇవ్వడం తో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

salaar movie prabhas entry scene dialogue leaked

కానీ ఇప్పుడు ఈ సినిమా ప్రమాదంలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు అనుకుంటున్నారా….ఇటీవల విడుదలైన ఒకే ఒక జీవితం స్టోరీ లైన్ ప్రాజెక్ట్ కె కి దగ్గరగా ఉంటుందట. ఒకే ఒక జీవితం మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. తన తల్లి కోసం హీరో టైం మెషిన్ లో కాలంలో వెనక్కి వెళతాడు. అలా స్కిన్స్ ఫిక్షన్ కథకు అమ్మ సెంటిమెంట్ జోడించడం తో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

oke oka jeevitham movie first review

ప్రాజెక్ట్ కె స్టోరీ లైన్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది అని టాక్. ఈ చిత్రం సైతం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సాగుతుంది. ఒక వేళ నిజంగా ఈ రెండు చిత్రాల కథలు సిమిలర్ అయితే ప్రాజెక్ట్ కె చిక్కుల్లో పడడం ఖాయం. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి విజువల్స్ అబ్బురపరిచినా స్టోరీ పరంగా ప్రేక్షకులు థ్రిల్ మిస్ పెదవి విరిచే ప్రమాదం ఉంటుంది.

reason behind prabhas movies disappoing after bahubali

ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త టాలీవుడ్ వర్గాలలో వణుకు పుట్టిస్తుంది. వందల కోట్ల పెట్టుబడితో భారీగా చిత్రీకరిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఒకవేళ ఈ రూమర్ నిజమైతే పరిస్థితి ఏమిటి అని అందరూ ఆందోళన పడుతున్నారు. పైగా రీసెంట్ గా అఖండ స్టోరీ లైన్ కి దగ్గరగా ఉన్న కారణం గా ఆచార్య డిజాస్టర్ గా మిగిలింది. మరి ఇప్పుడు ప్రాజెక్టు కే భవిష్యత్తు ఏమిటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది.


End of Article

You may also like