కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు…అత్తకి వాట్సాప్ లో పంపిన ఈ మెసేజ్ చూస్తే నవ్వాపుకోలేరు.!

కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు…అత్తకి వాట్సాప్ లో పంపిన ఈ మెసేజ్ చూస్తే నవ్వాపుకోలేరు.!

by Mohana Priya

Ads

కొంత మంది కొన్ని పనులు ఎలా చేస్తారంటే, వాళ్లు అమాయకత్వంతో అలా చేశారో, లేదా కావాలనే వెటకారంగా అలా చేశారో అర్థం కాదు. అలా ఒక కోడలికి తన అత్త అన్ని విషయాలపై ఎలా జాగ్రత్త వహించాలో, ప్రతి పనిని ఎలా మేనేజ్ చేయాలో వివరంగా చెప్పింది. అలా చెప్పి ఊరికి వెళ్ళింది అత్త. దాంతో కోడలు అన్ని పనులు అత్త చెప్పిన విధంగానే చేసింది.

Video Advertisement

మరి ఈ విషయం అత్తకి తెలియాలి కదా? అందుకే తను ఏ పని ఏ విధంగా చేసిందో వివరంగా చెబుతూ అత్తకి ఒక ఉత్తరం రాసింది కోడలు. ఉత్తరం చదివిన తర్వాత అత్త తనని మెచ్చుకోవడం ఖాయం అనుకుంది. కానీ అత్త మాత్రం ఉత్తరం చదివిన తర్వాత మెచ్చుకోవడం పక్కనపెడితే, షాక్ అయ్యింది. అసలు కోడలు ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే.

representative image

“అత్తయ్యా! మీరు ఇంటి గురించి ఎటువంటి దిగులు పడకండి. ఇక్కడ అన్ని మీరు చెప్పినట్లే జరుగుతున్నాయి. జరగకపోయినా కూడా నేనే దగ్గరుండి అన్ని పనులూ మీరు చెప్పిన విధంగానే జరిగేలా చూసుకుంటున్నాను. ఇంట్లో వంట దినుసులు అన్ని ఎక్కువ రోజులు రావాలి, అలాగే గ్యాస్ కూడా ఆదా చెయ్యాలి అన్నారు కదా? అందుకే అన్నీ జాగ్రత్తగా వాడుతున్నాను.

రోజుకి ఒక్క పూట మాత్రమే వంట చేస్తున్నాను. మిగిలిన రెండు పూట్ల కూడా వండితే, మళ్లీ పప్పు, ఉప్పు లాంటివి ఎక్కువగా వాడాల్సి వస్తుంది, ఇంకా గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కదా? అందుకే బయట నుంచి తెప్పిస్తున్నాను. షాపింగ్ ఖర్చు కూడా తగ్గించమన్నారు కదా? అందుకే వారానికి ఒక్కసారి మాత్రమే షాపింగ్ కి వెళ్తున్నాను. షాపింగ్ కి వెళ్ళిన ప్రతిసారి అన్ని చీరలు కొనవద్దు అన్నారు కదా? అందుకే షాపింగ్ చేసిన ప్రతిసారి ఒక్క చీర మాత్రమే కొనుక్కుంటున్నాను.

representative image

షాపింగ్ మొత్తం నా కోసమే ఏం చేయట్లేదు. మీ అబ్బాయికి కూడా ఒక కర్చీఫ్ కొన్నాను. నాకు తెలుసు అత్తయ్యా. మీరు చెప్పినది చెప్పినట్టు చేస్తున్నందుకు నన్ను చూసి మీరు గర్వపడుతున్నారు అని. మీరు ఇంక టెన్షన్ పడకండి. ఇక్కడ నేను అన్ని మీరు చెప్పినట్టు అయ్యేలాగే చూసుకుంటాను. మీరు ఇలాగే నన్ను చూసి గర్వపడేలా చేస్తాను”.  ఇప్పుడు అర్థమైందా ఉత్తరం చదివిన అత్త ఎందుకు షాక్ అయ్యిందో.


End of Article

You may also like