Ads
చాలా మందికి ఉద్యోగం వెంటనే వచ్చేయదు. కొన్నిసార్లు స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా కూడా రిజెక్షన్ కి గురి అవుతూ ఉంటారు. అయినా సరే వారికి కావాల్సిన దాని కోసం వదలకుండా మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఇలాగే తనకి టాలెంట్ ఉన్నా కూడా దాదాపు నలభై సార్లు రిజెక్షన్ కి గురయ్యారు. కానీ ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయడానికి గల కారణం మాత్రం కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, సద్దాం హుస్సేన్ అనే ఒక వ్యక్తి తమిళనాడులో నూరుల్ ఇస్లామ్ యూనివర్సిటీలో మరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత కొంతకాలానికి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సద్దాం హుస్సేన్ 2014 లో వాళ్ళ బ్యాచ్ లో రెండో ర్యాంకు సాధించారు. కానీ ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా రిజెక్షన్ ఫేస్ చేసేవారు.
అలా ఎందుకు అయ్యేదో మొదట సద్దాం హుస్సేన్ కి అర్థం కాలేదు. తర్వాత సద్దాం హుస్సేన్ HR డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు వారిలో కొంత మంది ఆయన పేరుతో వారికి ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. బార్డర్ అవతలకి సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే యాజమాన్యం ఏమీ చేయలేరు అని, అలాగే బార్డర్ దగ్గర, ఎయిర్ పోర్ట్ దగ్గర చెకింగ్ ఉంటుంది అని ఢిల్లీకి చెందిన ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితి ఒక సారి షారుక్ ఖాన్ కూడా ఎదురయ్యింది. సద్దాం హుస్సేన్ పేరుతో అంతకుముందు వార్తల్లో ఉన్న వ్యక్తి మనందరికీ తెలుసు. అందుకే ఈ సద్దాం హుస్సేన్ తర్వాత అధికారికంగా సాజిద్ గా తన పేరుని మార్చుకున్నారు. పేరు మార్చిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నిటిలో కూడా తన పేరును మార్చుకున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కి తన పేరు మార్చమని సద్దాం హుస్సేన్ అప్లికేషన్ పెట్టారు. కానీ యాజమాన్యం ఎటువంటి చర్య తీసుకోలేదు. చివరికి CBSE యాజమాన్యానికి తన పేరు మార్చమని చెప్పమని, జార్ఖండ్ హై కోర్ట్ కి అప్లై చేశారు. 2017 మే 5వ తేదీన కోర్టు జరిగింది. ఎవరో చేసిన తప్పుకు తనకు ఇబ్బంది కలిగింది అని సాజిద్ అన్నారు. తర్వాత ఏం జరిగింది అనే దానికి సంబంధించిన విషయాలు ఏవి ఎక్కడ బయటికి రాలేదు.
End of Article