“లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి మించిన గొప్ప ఉద్యోగం మరొకటి లేదు..!” అనుకునేవారు… ఇతను చెప్పేది తప్పక చదవండి..!

“లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి మించిన గొప్ప ఉద్యోగం మరొకటి లేదు..!” అనుకునేవారు… ఇతను చెప్పేది తప్పక చదవండి..!

by Mounika Singaluri

Ads

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనగానే లక్షల్లో జీతము, ఏసీ రూముల్లో పని, వారానికి రెండు రోజుల సెలవులు, హాయిగా ఉంటారు అనుకుంటారు. “కేవలం ఇది మాత్రమే గొప్ప ఉద్యోగం అనే భావన ఎందుకు కలుగుతుంది” అనే ప్రశ్నని కోరాలో ఒక యూజర్ పోస్ట్ చేశారు. దీనికి  సుధీర్ వర్మ అనే మరొక యూజర్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Video Advertisement

ఒక మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా.. మా ఇంట్లో జరిగిన విషయం, నాకు తెలిసిన విషయం చెబుతున్నా.. మా పెదనాన్న గారికి ఇద్దరు కొడుకులు. పెద్దన్నయ నాలానే సాఫ్ట్వేర్. రెండవ అన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో రేడియో టెక్నాలజీ డిపార్టుమెంట్. ఇంట్లో, బయట అందరు అనుకునేవారు పెద్దోడికి సుఖం హాయిగా ఏసీలో కుర్చుని నెలకి లక్ష సంపాదిస్తాడు అని.

చిన్నోడు పాపం ఉద్యోగం పేరుతో ఊరూరు ట్రాన్స్ఫర్ అంటూ తిరుగుతాడు అనుకునేవారు. పెద్దోడు ఈ రోజుకి సంపాదించి దాచింది ఏమి లేదు, చిన్నోడు పొలం కొనుక్కుని కొంత డబ్బు సేవ్ చేసి రిటైర్ అయ్యాక కూడా మంచి ఉద్యోగం సంపాదించగలడు. అయితే కరోనా వలన పెద్దోడు హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చి పని చేసుకున్నాడు. పేరుకి పెద్ద కంపెనీలో మేనేజర్. నాలుగు ప్రాజెక్ట్స్ కి ఒక్కడే లీడ్. జీతం ఒక లక్ష పైన ఉంటుంది.

కానీ యోగి తపస్సు చేసినట్లు పొద్దున్న తొమ్మిది కి గదిలోకి వెళ్లి ఏ అర్ధరాత్రో బయటకి వస్తాడు. తిండి తింటే తింటాడు లేకపోతే లేదు. ఒక పక్క పని, మరొకపక్క మీటింగ్స్, డెలివరీ, ఎస్కలేషన్స్, అప్డేట్స్ ఇలానే ఏడాది గడిచిపోయింది. అపుడు పెదనాన్న నోటి నుండి వచ్చిన మాట.. ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కాని వీడు పాపం చాలా కష్ట పడుతున్నాడు. చిన్నన్నయ్య ఉద్యోగమే బాగుంది అన్నారు.

ఎంత ఏసీ లో కూర్చుని లక్ష జీతం వచ్చినా, పది లక్షల రూపాయల పని చేయించుకుంటారు సాఫ్ట్వేర్ లో. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. ఎక్కడి నుండి అయినా పని చేయాల్సిందే. నీకు నచ్చిన టైం తీస్కో సాయంత్రానికి పని అయిపోవాలి. ఇదే మా ఫార్ములా. వీకెండ్, పబ్, ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ తాయిలాలు మాత్రమే. గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. ఎంత ఏసీ గదుల్లో ఉన్నా వర్క్ టెన్షన్ కి చెమటలు పడతాయి.


End of Article

You may also like