ఆ సినిమా మధ్యలో శ్రీహరి చనిపోయారు.. దానితో జగపతిబాబు ఏమన్నారంటే? ఎమోషనల్ అయిన డైరెక్టర్..!

ఆ సినిమా మధ్యలో శ్రీహరి చనిపోయారు.. దానితో జగపతిబాబు ఏమన్నారంటే? ఎమోషనల్ అయిన డైరెక్టర్..!

by Anudeep

Ads

శ్రీహరి గారు భౌతికంగా దూరమై ఎన్నేళ్ళైనా.. ఆయన ఇంకా మన మధ్యే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన సినిమాలు చూస్తున్నంత సేపు ఆయన ఇంక లేరు అంటే నమ్మబుద్ధి కాదు. ఆయన చనిపోయే సమయానికి అప్పటికే సైన్ చేసిన చాలా సినిమాలు ఆగిపోయాయి. కొన్ని వేరే నటులను పెట్టి రీప్లేస్ చేసారు. వాటిల్లో “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమా కూడా ఒకటి.

Video Advertisement

a s ravikumar 1

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బాగా హిట్ అయింది. ఈ సినిమాలో జగపతి బాబు నటించిన పాత్రకి మొదటగా శ్రీహరిని అనుకున్నారట. ఆయన కొంతవరకు షూటింగ్ కూడా కంప్లీట్ చేశారట. ఆ తరువాత ఆయన మరణించడం తో ఆ పాత్రను చేయాల్సిందిగా దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి జగపతిబాబు ను అడిగారట. అందుకు జగపతిబాబు గారు కూడా సహృదయం తో ఒప్పుకున్నారు.

jagapathi babu

ఏ ఎస్ రవి కుమార్ చౌదరి గారు కూడా దర్శకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో సౌఖ్యం, పిల్లా నువ్వు లేని జీవితం మంచి విజయాలు సాధించాయి. ఈయన తొలి సినిమా “వీరభద్ర”. ఈ సినిమాలో బాలయ్య హీరో గా నటించారు. ఈ సినిమా బోల్తా కొట్టింది. ఆతరువాత కొంత గ్యాప్ తీసుకున్న రవి కుమార్ తిరిగి సినిమాలు చేయడం ప్రారంభించారు.

sai dharam tej

అలా జగడంలో పని చేసారు. ఆ తరువాత “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథ నచ్చడంతో అల్లు అరవింద్ అవకాశం ఇచ్చారట. అయితే.. శ్రీహరితో తెరకెక్కించిన సన్నివేశాలు మళ్ళీ తెరకెక్కించాల్సి రావడం, అయితే కొన్ని సన్నివేశాల పట్ల అల్లు అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేయడం తో మళ్ళీ షూటింగ్ చేయాల్సి వచ్చిందట. వీటివల్ల సినిమా విడుదల ఆలస్యమైంది అంటూ రవి కుమార్ చౌదరి చెప్పుకొచ్చారు.


End of Article

You may also like