Ads
మనందరిలో చాలా మంది రోజు మొదలయ్యేది పాలు, లేదా టీ, లేదా కాఫీ తో. అలాగే పెరుగు, మజ్జిగ లేకపోతే భోజనం కూడా చాలా మందికి ఎక్కదు. అందుకే కాలమెంత గడిచినా కూడా పాలకి మాత్రం డిమాండ్ అలాగే ఉంటుంది. మన దగ్గర చాలా మంది ప్యాకెట్ పాలను తీసుకుంటారు. లేకపోతే ఎవరైనా పాలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. కానీ పాలు ఉచితంగా ఇవ్వడం అనేది మాత్రం జరగదు.
Video Advertisement
కానీ ఒక చోట పాలు ఇలాగే ఉచితంగా ఇస్తారట. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలోని గంజిహళ్లి అనే ఒక ఊరిలో పాలని ఉచితంగా ఇస్తారు. ఈ ఊరిలో 1100 కుటుంబాలు ఉంటారు. దాదాపు 5000 మంది జనాభా ఉంటుంది. అందరికీ పొలంతో పాటు, ఆవులు, బర్రెలు కూడా ఉంటాయి. ఆ ఊరు మొత్తం కలిపి దాదాపు 120 ఆవులు, 20 బర్రెలు ఉంటాయి.
image courtesy : the new indian express
అవన్నీ కలిపి 1000 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ పాలని అమ్మరు. అందుకు కారణం ఏమిటంటే, 17వ శతాబ్దంలో ఈ ఊరిలో బడే సాహెబ్ అనే ఒక గురువు ఉండేవారు. ఆయన ఈ ఊరు కోసం ఎన్నో గొప్ప పనులు చేశారు. అప్పుడు ఆయన గో హింస చేయడం తప్పు అని, పాలు అమ్మడం నిషేధించాలి అని అన్నారు.
అప్పటినుంచి ఈ ఊరి వారు ఆవులని దహించడం కానీ, వాటి పాలని అమ్మడం కానీ చేయరు. ఈయన సమాధి మీద దర్గా కట్టి ఆ ఊరి వాళ్ళు వాళ్లు అందరూ కొలుస్తూ వుంటారు. ఆయన చెప్పిన మాటలు ఆచరించకపోతే అరిష్టం జరుగుతుంది అని వారు నమ్ముతారు.
మా ఊరిలో ఉండే వెంకమ్మ గారు మాట్లాడుతూ, “ఇక్కడ ఏ దుకాణంలో కూడా పాలు కానీ , పెరుగు కానీ అమ్మరు. మా ఇంట్లో కూడా ఆవులు ఉన్నాయి. అవి రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తాయి. అందులో నుండి మా ఇంట్లో వారి కోసం 1-2 లీటర్ల పాలను పక్కన పెట్టి, మిగిలిన పాలను ఎవరైనా అవసరం ఉన్న వాళ్లకి ఉచితంగా ఇచ్చేస్తాం.
image courtesy : chaibisket
మేమే కాదు. ఈ ఊరిలో ఉండే అందరూ ఇలానే చేస్తారు. మా తాతల నుండి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ అందరం మధ్య తరగతి వాళ్ళమే. మాకు డబ్బు అవసరం ఎంత ఉన్నా కూడా పాలను ఉచితంగానే ఇస్తాం కానీ వాటితో వ్యాపారం చేయము” అని అన్నారు.
End of Article