ఆ మహిళ చేసిన పొరపాటుకు…రతన్ టాటాకు ఫైన్ వేసిన పోలీసులు..! అసలేమైంది.?

ఆ మహిళ చేసిన పొరపాటుకు…రతన్ టాటాకు ఫైన్ వేసిన పోలీసులు..! అసలేమైంది.?

by Anudeep

Ads

కొన్ని కొన్ని పొరపాట్లు యాదృచ్చికంగా జరుగుతుంటాయి. కానీ చట్టం ముందు ఎలాంటి పొరపాట్లకు అయినా శిక్ష పడుతూనే ఉంటుంది. ఇలాంటి యాదృచ్ఛిక సంఘటనే ఒకటి ముంబై లో చోటు చేసుకుంది. ఓ మహిళ తన కార్ ప్లేట్ కి కేవలం ఒక్క నెంబర్ తీసివేయడం వలన వచ్చిన చిక్కు ఇది. పోలీసులు విచారణ చేపట్టి ఆ మహిళ ఎవరో వెతికి పట్టుకుని మరీ కేసు నమోదు చేసారు. నెంబర్ ప్లేట్ ని మార్చినందుకు గాను ఆమె కి శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Video Advertisement

ratan tata 1

పూర్తి వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర కి చెందిన గీతాంజ‌లి సామ్ షా అనే ఓ మహిళ తన కారు నెంబర్ లో చివరి సంఖ్యా అయిన జీరో ను తీసివేసింది. అది రతన్ టాటా కారు నెంబర్. ఆమె రతన్ టాటా కారు నెంబర్ ను ఇన్నాళ్లు వాడుకుంటూ వచ్చింది. అంతే కాకుండా, ట్రాఫిక్ నిబంధనలను కూడా ఉల్లంఘించింది. దీనివలన, ఆమెకు పడాల్సిన ఫైన్ రతన్ టాటా కి పడింది. పోలీసులు ఆమె కట్టాల్సిన ఫైన్ చలానాలకు రతన్ టాటా ఆఫీస్ కు పంపించారు. పోలిసుల వద్ద నుంచి ఈ-చలానా లు రావడం తో టాటా ఆఫీస్ లోని ఉద్యోగులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.

ratan tata car

దీనితో, వెంటనే రంగం లోకి దిగిన పోలీసులు విచారణ జరిపి ఓ మహిళ ఈ నెంబర్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సదరు మహిళను పట్టుకుని ప్రశ్నించగా, తనకు ఓ న్యూమెరాలజిస్ట్ ఈ నెంబర్ ను వాడాలని సూచించారని, అందుకే తన కారు నెంబర్ లోని చివరి నెంబర్ ను తీసివేసినట్లు తెలిపింది. వాస్తవానికి ఈమె కారు నెంబర్, రతన్ టాటా కారు నెంబర్ చాలా వరకు సేమ్. ఆమె కారు నెంబర్ చివరిలో 1110 ఉంటుంది. అందులోంచి 0 ను తీసివేసి వాడుతోంది. అది రతన్ టాటా కారు నెంబర్ (111). దీనితో, పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసారు. రతన్ టాటా కు పంపిన చలనాలను ఆ మహిళకు పంపించారు. అయితే తప్పుడు కారు నెంబర్ వినియోగించిన కేసు లో ఆమె కు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.


End of Article

You may also like