అబ్బాయిలు మర్చిపోయినంత తేలిగ్గా.. అమ్మాయిలు ప్రేమ ను మర్చిపోలేరు అంటూ ఓ అమ్మాయి మాకు పంపిన మెసేజ్.. దీనిపై మీ కామెంట్ ఏంటి..?

అబ్బాయిలు మర్చిపోయినంత తేలిగ్గా.. అమ్మాయిలు ప్రేమ ను మర్చిపోలేరు అంటూ ఓ అమ్మాయి మాకు పంపిన మెసేజ్.. దీనిపై మీ కామెంట్ ఏంటి..?

by Anudeep

Ads

ప్రేమ అనేది అనిర్వచనీయమైనది. అది ఎవరి పై అయినా.. ఏ క్షణం లో అయినా కలగవచ్చు. అయితే, చివరి దాకా నిలబడగలగడం అనేది ఆ ఇద్దరు వ్యక్తుల సంకల్పం పైనా, పరిస్థితులపైనా ఆధారపడి ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు.. నా పిల్ల నన్ను మర్చిపోయింది.. ఈ అమ్మాయిలంతా ఇంతే.. ప్రేమను తేలిగ్గా మర్చిపోతారు అంటుంటారు.. కానీ, ఇది నిజం కాదంటూ ఓ అమ్మాయి పంపిన మెసేజ్ ను చదవండి.

Video Advertisement

women breakup 2

నా పేరు రమ్య. బి టెక్ చదువుతున్న రోజుల్లోనే రవి పరిచయమయ్యాడు. ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. ప్రేమిస్తున్నా.. నువ్వు లేకపోతె నేను లేను అంటూ చెప్పుకొచ్చేవాడు. మాది చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్న కుటుంబం. ప్రేమిస్తే.. జీవితాంతం నిలవాలన్న ఆలోచనలు ఉన్న నేను అతని ప్రేమను అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేదు. ఇంట్లో మేము మంచి స్నేహితులం అన్నట్లు చెప్పుకొచ్చేదాన్ని.. నా ప్రేమ నిలబడుతుందన్న నమ్మకం వచ్చాక, తన ప్రేమను అంగీకరించాను.

women breakup

తాను పదే పదే ఐలవ్ యు చెప్పేవాడు. తను ‘రమ్యా.. ఐ లవ్ యు’ అని అన్నప్పుడల్లా..ఆకాశం లో తేలిపోతున్న అనుభూతి కలిగేది. ఇద్దరం కలిసి గుడులకి, పార్క్ లకి, సినిమాలకి వెళ్ళేవాళ్ళం. తన బైక్ పై నన్ను ఊరంతా తిప్పేవాడు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాను కదా అని నేను అడ్డు పడేదాన్ని కాదు. కానీ హఠాత్తుగా ఏమి జరిగిందో తెలియదు. నా ఫోన్స్ కి రెస్పాండ్ అవడం మానేసాడు. అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు.

women breakup 5

తనని ఎన్ని సార్లు కలవాలని ప్రయత్నించినా ఓడిపోయేదాన్ని. ఓరోజు తనను మర్చిపోవాలని, తన మరదలితో పెళ్లి కుదిరిందని, ఇక పై కలవడానికి గాని, కాంటాక్ట్ చేయడానికి గాని ప్రయత్నించవద్దని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లయింది. అతను ఏమి చెప్తున్నాడో కూడా అర్ధం కాలేదు. చాల సేపటికి తేరుకున్నాక, నన్ను మోసం చేసాడని అర్ధమైంది. ప్రేమ పేరుతో నా వెంట పడి, నా మనసుతో ఆటలాడుకుని, ఇప్పుడు ఆస్తి కోసం మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. ఓ వైపు నా పై నాకే అసహ్యమేసింది.

women breakup 4

కానీ, అతనితో గడిపిన క్షణాలన్నీ నాకు మధుర స్మృతులే. నెలలు గడుస్తున్నా… అతన్ని మర్చిపోలేకపోతున్నాను. మరొకరికి మనసులో స్థానం ఇవ్వడాన్ని కూడా ఉహించుకోలేను. తాను లేని జీవితాన్ని ఉహించుకోవాలంటేనే భయం గా ఉంది. అమ్మాయిలు ప్రేమ ను ఈజీ గా మర్చిపోగలరు అంటుంటారు. కానీ, ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ప్రేమ ను అబ్బాయిలు మర్చిపోయినంత ఈజీ గా అమ్మాయిలు మర్చిపోలేరు. అమ్మాయిలకు మనసు ఉంటుంది. కానీ, మా జీవితాలు మా చేతుల్లో ఉండవంతే. ఇది తెలుసుకోకుండా.. కొందరు ఏదేదో అంటుంటారు. వారందరిని అడుగుతున్నా.. ఇప్పుడు నా పరిస్థితేంటి..? నేనేమి చేయాలి.. తన జీవితం లోకి వెళ్ళలేను. తను లేని జీవితాన్ని గడపలేను.. మరి నాకు పరిష్కారమేంటి..?


End of Article

You may also like