Ads
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా మొబైల్ ట్యాగ్ లైన్ గురించి చెప్పట్లేదు. నిజంగానే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. మార్చేసింది కూడా. ఎవరిదో అనుకుంటున్నారా? శాంతను నాయుడు ది. సామాజిక స్పృహతో అతను చేసిన ఒక్క పని అతన్ని రతన్ టాటా కి అసిస్టెంట్ ని చేసింది. అతని కథ విన్న తర్వాత మీకు కూడా ఇలాగే ఐడియా జీవితాన్ని మార్చేయవచ్చు అన్న విషయం నిజమేనేమో అనిపిస్తుంది.
Video Advertisement
2014లో శాంతను ఇంజనీరింగ్ పూర్తి చేసి టాటా సంస్థలో ఉద్యోగిగా చేరాడు. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఆక్సిడెంట్ అయింది చనిపోయింది. శాంతను కి ఆ సంఘటన ఎంతగానో వెంటాడింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నాడు.
కొన్ని రోజులు అలాగే ఆలోచించి తన స్నేహితులతో కలిసి ఒక కుక్క బెల్ట్ ను రూపొందించాడు. బెల్టు మొత్తం ఒకే రంగులో కాకుండా వివిధ రంగులు కలిపి తయారు చేశాడు. దాంతో అన్ని రంగులు ఉన్న బెల్ట్ ను వేసుకున్న రోడ్డుమీద కి వెళ్తే ఎదురుకుండా ఏమైనా వాహనం ఉంటే ఆ బెల్టు మీదున్న రంగులు రిఫ్లెక్ట్ అయ్యి మనిషి వాహనాన్ని ఆపేస్తాడు. బెల్ట్ లో ఉన్న రేడియం వల్ల చీకట్లో కూడా వెలుగుతుంది దానివల్ల చీకటిగా ఉన్నా కానీ కుక్కలు దారికి మధ్యలో ఉంటే గుర్తించి వెహికల్ ఆపుతారు. దాంతో ప్రమాదం తప్పుతుంది.
మొదట ఒక కుక్క కోసమే తయారుచేశాడు శాంతను. తర్వాత స్థానికులు దాన్ని చూసి తమకు కూడా అలాంటి బెల్ట్ కావాలి అని అడిగారు. ఇంక శాంతను కి దీని వ్యాపారం గా మార్చాలి అన్న ఆలోచన వచ్చింది. కానీ శాంతను దగ్గర అన్ని బెల్టులు తయారు చేసే అంత డబ్బులు లేవు. ఇదంతా చూస్తున్న శాంతను వాళ్ళ నాన్న టాటా ఇండస్ట్రీస్ కి ప్రాజెక్ట్ ఫండింగ్ చేయడానికి ఉత్తరం రాయమన్నాడు. కానీ శాంతను కి టాటా వాళ్లు తిరిగి జవాబు ఇస్తారు అనిపించలేదు. అయినా సరే తండ్రి చెప్పారు అని ఉత్తరం రాశాడు.
రెండు నెలల వరకు టాటా ఇండస్ట్రీ నుండి ఎటువంటి జవాబు లేదు. ఇంక వాళ్ళు తిరిగి సమాధానం ఇవ్వరు అని అనుకుంటున్న సమయంలో రెండు నెలల తర్వాత శాంతను కి టాటా ఇండస్ట్రీస్ నుండి కాల్ వచ్చింది. ముంబై కి రమ్మని పిలిచారు. రతన్ టాటా కి కూడా మూగజీవాల అంటే ఇష్టం ఉండటంతో ఇలాంటి ప్రాజెక్టు వల్ల ఎన్నో మూగజీవాలను ప్రమాదానికి గురి కాకుండా రక్షించవచ్చు కాబట్టి ఈ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలా శాంతను మోటో పాస్ అన్న కంపెనీని ప్రారంభించాడు.
ఈ కంపెనీ ని స్నేహితులతో పాటు నడుపుతున్నాడు. ఒక పక్క కంపెనీ పని చేసుకుంటూనే మరో పక్క ఉన్నత చదువుల కోసం వేరే దేశానికి వెళ్ళాడు. చదువు ముగించుకుని తన స్వదేశానికి వచ్చిన కొన్ని నెలల తరువాత సడన్గా ఒక రోజు టాటా ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. స్వయంగా రతన్ టాటా నే తన పని ఎక్కడికక్కడ ఆగిపోయింది వచ్చి చేసి పెడతావా అని అడిగారు. దాంతో రతన్ టాటా దగ్గర 18 నెలలు పర్సనల్ అసిస్టెంట్ గా చేసే అవకాశాన్ని పొందాడు శాంతను.
ఇప్పుడు చెప్పండి మీకు కూడా అనిపించింది కదా జీవితాన్ని మార్చడానికి ఒక ఆలోచన చాలు అని. దానికి శాంతను కథే నిలువెత్తు నిదర్శనం. తను ఎక్కడ టాటా ఎక్కడ అని అనుకునే స్థాయి నుండి ఇవాళ టాటా తో భుజం మీద చెయ్యి వేయించుకొని ఫోటో దిగే అంత స్థాయికి వచ్చాడు. ఎవరైనా అంతే. మనం మార్పు కి ఒక ఆలోచన దూరంలో ఉంటాం. శాంతను ఫలితం గురించి ఆలోచించకుండా ఉత్తరం రాసి తన ప్రయత్నం చేశాడు. అలాగే ఫలితం గురించి ఆలోచించకుండా నిజాయితీగా మన ప్రయత్నం మనం చేస్తే కచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటాం అనడానికి ఇది ఒక ఉదాహరణ.
End of Article