• చిత్రం : టాప్ గేర్
  • నటీనటులు : ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, శత్రు, సత్యం రాజేష్, మైమ్ గోపి
  • నిర్మాత : కె.వి.శ్రీధర్ రెడ్డి
  • దర్శకత్వం : శశికాంత్
  • సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
  • విడుదల తేదీ : డిసెంబర్ 30 , 2022

 

స్టోరీ :
క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే కుర్రాడు అర్జున్ (ఆది సాయి కుమార్). మరో వైపు నగరం లో పలు హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటిని చేసే హంతకుడు ఎవరో తెలియదు. ఈ లోపు అర్జున్ ఒక హత్యకు ప్రత్యక్ష సాక్షిగా మారతాడు. అప్పటి నుంచి పోలీసులకు, గూండాలకు అతడు most వాంటెడ్ అవుతాడు. చివరికి ఈ సమస్య నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు.. కిల్లర్ దొరికాడా అన్నది మిగతా కథ..

Video Advertisement

top gear telugu-movie-story-review-rating

రివ్యూ :

చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంటాడు ఆది సాయి కుమార్. ఈ సంవత్సరం 5 సినిమాలు రిలీజ్ చేసాడు. అవి అంతగా ఆడలేదు. ఇక ఈ ఏడాదికి ఫైనల్ గా టాప్ గేర్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రం లో మధ్యతరగతి కుర్రాడిగా బాగా నటించాడు. కానీ కొన్ని సన్నివేశాల్లో అతని నటన తేలిపోయింది. మిగతా నటులు పరిధి మేరకు నటించారు.

 

ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రం అయినప్పటికీ, సినిమా అంతటా అక్కడక్కడా కొన్ని చిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. హత్యలతో ఆసక్తికరం గా సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బావుంది. కొన్ని లోపాలు ఉన్నా కానీ స్క్రీన్ప్లే తో మేజిక్ చేసాడు దర్శకుడు. కథ రచన బావుంది కానీ కథనం కొన్ని చోట్ల తడబడింది.

top gear telugu-movie-story-review-rating

సాయి శ్రీరామ్ విజువల్స్ బావున్నాయి కానీ.. నైట్ టైం వచ్చే సన్నివేశాలు ఇంకాస్త బాగా తీసుండొచ్చు. హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు అంతగా ఆకట్టుకోవు; కానీ అతను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్ :

  • స్క్రీన్ ప్లే
  • ట్విస్ట్ లు

 

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ కథ
  • ఎమోషన్స్ లేకపోవడం

top gear telugu-movie-story-review-rating

రేటింగ్ :

2 .5 /5

ట్యాగ్ లైన్ :

‘టాప్ గేర్’ కమర్షియల్ అంశాలతో వచ్చిన మంచి యాక్షన్ థ్రిల్లర్.

watch trailer: