బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కానున్నాయి. అన్నిటిని ఒక్కోటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్.

Video Advertisement

 

 

ఇక ముందుగా రిలీజ్ కానున్న చిత్రం ఆదిపురుష్. మొదటిసారి ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న ప్రాజెక్ట్ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.

aadipurush movie run time locked..!!

ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. తాజాగా సీతానవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి సీతాదేవి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇప్పటివరకు ఈ మూవీ పై ఉన్న నెగటివిటీ ని పోగొట్టింది ఈ పోస్టర్.

aadipurush movie run time locked..!!

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ను సుమారు 3 నిముషాల 22 సెకండ్స్ ఉండేలా కట్ చేసారని టాక్. 3డి వర్షన్ లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

aadipurush movie run time locked..!!

ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినా తర్వాత చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు మేకర్స్. ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఈ మూవీ గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ దర్శకుడి పై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. దీంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ గ్రాఫిక్స్‌ను, విజువల్స్‌ను కాస్త బెటర్‌ చేసేందుకు ప్రయత్నించింది. అందుకే గత ఏడాది ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం అంతకంతకూ ఆలస్యం అవుతోంది.